నిజంగా చల్లటి కబురు : ఇషికా ఆచూకీ లభ్యం | Sakshi
Sakshi News home page

నిజంగా చల్లటి కబురు : ఇషికా ఆచూకీ లభ్యం

Published Thu, Apr 11 2024 4:47 PM

Missing Indian American student found in Texas - Sakshi

 ఇటీవలి కాలంలో అమెరికాలో భారతీయ విద్యార్థులు  అనూహ్యంగా ప్రాణాలు కోల్పోతున్న తరుణంలా అమెరికాలో భారత్‌కుకెందిన ఇండో-అమెరికన్ విద్యార్థి సురక్షితంగా బైటపడటం  నిజంగా చల్లటి కబురు. టెక్సాస్‌లోని తన ఇంటినుంచి సోమవారం రాత్రి  అదృశ్యమైన 17 ఏళ్ల ఇషికా ఠాకోర్‌ను ఫ్రిస్కో పోలీసులు సురక్షితంగా గుర్తించారు.  అయితే ఎపుడు, ఎక్కడ, ఎలా కనుగొన్నారు అనే వివరాలను మాత్రం   ఫియాస్కో పోలీసులు వెల్లడించలేదు.

టెక్సాస్‌లోని ఫ్రిస్కో పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, ఏప్రిల్ 8, సోమవారం తప్పిపోయింది. ఫ్రిస్కోలోని బ్రౌన్‌వుడ్ డ్రైవ్‌లోని తన ఇంటి నుండి ఇషికా అదృశ్యమైందంటూ క్రిటికల్ మిస్సింగ్ హెచ్చరికను జారీ చేశారు. ఈమేరకు ట్విటర్‌లో ఒకపోస్ట్‌ పెట్టారు. ఇటీవల తప్పి పోయిన పలువురు భారతీయ విద్యార్థులు ఆ తర్వాత శవమై కనిపించడంతో ఇషికా అదృశ్యం ఆందోళన రేపింది. అయితే  ఆమె ఆచూకీ లభించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కాగా గత కొన్ని నెలల్లో  అమెరికాలో  11 మంది భారతీయ,  భారతీయ సంతతికి చెందిన  విద్యార్థులు చనిపోయారు.  ముఖ్యంగా గత నెల నుంచి  తప్పిపోయిన మహ్మద్ అబ్దుల్ అర్ఫాత్ (25) అనే భారతీయ విద్యార్థి మంగళవారం ఓహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లో శవమై కనిపించాడు. అలాగే ఓహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లో మరో భారతీయ సంతతి విద్యార్థి ఉమా సత్యసాయి గద్దె మరణించచాడు. 
 

Advertisement
 
Advertisement