నాట్స్ ఆధ్వర్యంలో ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్

Covid Vaccination Drive Conducted By NATS - Sakshi

ఎడిసన్, న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం  నాట్స్.. న్యూజెర్సీలో సాయి దత్త పీఠంతో కలిసి ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించింది. న్యూజెర్సీలోని వుడ్లేన్ ఫార్మసీ (ఓల్డ్ బ్రిడ్జి), తెలుగు కళా సమితి ఈ  వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమానికి తమ వంతు మద్దతు, సహకారం అందించాయి. ఈ వ్యాక్సిన్ డ్రైవ్ లో పిల్లలకు, పెద్దలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించారు. కోవిడ్ రెండు  డోసులుపూర్తయిన వారికి బూస్టర్ డోస్ కూడా ఈ వ్యాక్సిన్ డ్రైవ్‌ లో ఇచ్చారు. 

అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు కోవిడ్  బారిన పడకుండా ఉండేందుకు నాట్స్ ఈ వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టింది. సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి, వెంకట్ మంత్రిప్రగడలతో పాటు పలువురు బోర్డు సభ్యులు, స్టాఫ్ వాలంటీర్ల  సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీ శివ విష్ణు దేవస్థానం కమ్యూనిటీ హాల్ లో ఈవ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టారు. న్యూజెర్సీ పబ్లిక్ యూటీలిటీ కమిటీ ఉపేంద్ర చివుకుల ఇందుకు తన పూర్తి సహకారాన్ని అందించారు. దాదాపు 250 మందికి పైగా తెలుగువారు పిల్లలతో సహా ఈ డ్రైవ్‌లో వ్యాక్సిన్లు వేయించుకున్నారు. ఎంతో ఓపికగా వ్యాక్సిన్లు వేసిన ఫార్మసిస్ట్ రవి కి నాట్స్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

స్థానిక వైద్యులు సూర్యం గంటి, విజయనిమ్మ, భవాని జీ రెడ్డి, అన్నదానం వరలక్ష్మిలు తమ విలువైన సమయాన్ని ఈ ఉచిత వాక్సిన్ శిబిరం కోసం వెచ్చించారు. న్యూజెర్సీ నాట్స్ విభాగం నాయకులు అరుణ గంటి, మోహన కృష్ణ మన్నవ, రాజ్ అల్లాడ, రంజిత్ చాగంటి, మురళీ కృష్ణ మేడిచర్ల, సుధీర్ మిక్కిలినేని, రవి గుమ్మడిపూడి, శ్యాం నాళం, రమేశ్ నూతలపాటి, వంశీ కృష్ణ వెనిగళ్ల, శ్రీహరి మందాడి, చంద్రశేఖర్ కొణిదెల, సురేష్ బొల్లు, మోహన్ కుమార్ వెనిగళ్ల, గిరి కంభంమెట్టు, కిరణ్ కుమార్ తవ్వ , విజయ్ బండారు,  హర్ష చదలవాడ, అభి బొల్లు, అజయ్, అంజు తదితరులు ఈ వ్యాక్సిన్ డ్రైవ్ విజయవంతానికి తమ వంతు కృషి చేశారు. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top