లండన్‌లో ఘనంగా ‘టాక్ - చేనేత బతుకమ్మ- దసరా’ సంబురాలు

Bathukamma Dasara Sambaralu 2022 In London By Tauk - Sakshi

ప్రత్యేక ఆకర్షణగా యాదాద్రి దేవాలయ నమూన ప్రతిమ

ముఖ్య అతిధిగా ఎఫ్దీసి చైర్మన్ అనిల్ కూర్మాచలం

లండన్: లండన్‌లో చేనేత బతుకమ్మ - దసరా సంబరాలను తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి యుకే నలుమూలల నుంచి రెండు వేలకు పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కూర్మాచలం, భారత హై కమిషన్ ప్రతినిధి లక్ష్మి నారాయణన్, స్థానిక హౌన్సలౌ డిప్యూటీ మేయర్ కౌన్సిలర్ ఆదేశ్ ఫర్మాన్‌లు పాల్గొన్నారు.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో తమ వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ప్రతీ సంవత్సరం లాగా ఈసారి కూడా వేడుకలను "చేనేత బతుకమ్మ-దసరా" గా జరుపుకున్నామని సంస్థ అధ్యక్షుడు తెలిపారు. ప్రతీ సంవత్సరం బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ లోని ఏదో ఒక ముఖ్యమైన చారిత్రాత్మక కాట్టడాల నమూనాని ప్రత్యేక ఆకర్షణగా నిలుపుతున్నామని, ఈసారి యాదాద్రి దేవాలయ నమూనా ప్రదర్శించామని చెప్పారు.

ఎఫ్దీసి చైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. టాక్ వ్యవస్థాపకుడిగా ఒక తెలంగాణ కార్యకర్తగా దాదాపు దశాబ్ద కాలం లండన్ గడ్డ పై పని చేశానని, ప్రస్తుతం అతిథిగా అదే గడ్డపై ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా గర్వంగా ఉందన్నారు. యూకే ప్రవాస సమాజమంటే ప్రత్యేక గౌరవముందని, ఎక్కడికి వెళ్లినా ప్రోత్సహించిన ప్రతీ ఒక్కరిని గుర్తుపెట్టుకుంటానన్నారు. 


ఈ  కార్యక్రమంలో టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, టాక్ ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి - సత్యమూర్తి చిలుముల, ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు మరియు టాక్ కన్వీనర్ అశోక్ గౌడ్ దూసరి, టాక్ ప్రధాన కార్యదర్శులు సురేష్ బుడగం - జాహ్నవి దుసరి, అడ్వైసరి బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి, కమ్మూనిటీ అఫైర్స్  చైర్మన్ నవీన్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు పవిత్రా రెడ్డి, ముఖ్య సభ్యులు స్వాతి బుడగం, సుప్రజ పులుసు, వెంకట్ రెడ్డి దొంతుల, మల్లా రెడ్డి, సత్యపాల్ పింగిళి, గణేష్ పాస్తం ,రాకేష్ పటేల్, రవి రేటినేని, రవి ప్రదీప్ పులుసు, నవీన్ భువనగిరి, మాధవ్, సతీష్ రెడ్డి గొట్టిముక్కుల, శ్రావ్య, శ్రీవిద్య, వేణు నక్కిరెడ్డి, హరి గౌడ్ నవాబ్ పేట్, రాజేష్ వర్మ, క్రాంతి రేటినేని, మమత జక్కీ, శ్వేతా మహేందర్, మధుసూదన్ రెడ్డి, శ్వేతా రెడ్డి,  శశి, ప్రశాంత్ మామిడాల, శ్రీకాంత్ ముదిరాజ్, తేజ, నిఖిల్, సందీప్ బుక్క, అక్షయ్, మౌనిక, ప్రవీణ్ వీర, రంజిత్ , వంశీ , నరేష్ , నాగరాజు, మ్యాడి తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top