చికిత్స పొందుతూ ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ ఒకరు మృతి

May 19 2026 2:10 AM | Updated on May 19 2026 2:10 AM

చికిత్స పొందుతూ ఒకరు మృతి

గాంధారి(ఎల్లారెడ్డి): రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై మహేందర్‌ సోమవారం తెలిపారు. ఈ నెల 15న రాత్రి గాంధారికి చెందిన పత్తి దేవేందర్‌ (38), పనుకంటి భాస్కర్‌ సదాశివనగర్‌ మండలం బొపల్లిలో హమాలీ పనులు ముగించుకొని బైక్‌పై గాంధారికి వస్తుండగా పెట్రోల్‌ బంకు సమీపంలో కామారెడ్డి వైపు నుంచి గాంధారి వైపు వస్తున్న తూపాన్‌ వాహనం వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో దేవేందర్‌కు బలమైన గాయాలు కాగా భాస్కర్‌కు చేతికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా, దేవేందర్‌ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి దేవేందర్‌ మృతి చెందాడు. మృతుడి తండ్రి పత్తి నారాయణ ఫిర్యాదు మేరకు డ్రైవరు రమేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement