ఆర్మూర్ పట్టణంలోని మోడల్ స్కూల్ మైదానంలో క్రికెట్ ప్రాక్టీస్ కోసం వచ్చిన విద్యార్థులు
ఆర్మూర్ : రోజూ సాయంత్రం 5 గంటలు అయ్యిందంటే చాలు ఆర్మూర్ పట్టణంలోని మోడల్ స్కూల్ మైదానం క్రికెట్ స్టేడియంలా మారిపోతోంది. క్రికెట్ బ్యాట్‌లు, బాల్‌లు, 60 మంది పిల్లల అరుపులతో హోరెత్తుతోంది. ఈ సందడికి కారణం రతన్ వినోద్ వారి కొడుకులు. రతన్‌న్ వినోద్‌కు రతన్ వర్షిత్, రతన్ విజ్ఞాన్ కొడుకులు. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న వీరు ఏడేళ్ల క్రితం కరోనా సమయంలో సెల్‌ఫోన్, టీవీకి బానిసలైపోయారు. వారిని చూసి భయపడ్డ రతన్ వినోద్ ఒకరోజు ఇద్దరి చేతిలోంచి ఫోన్ లాక్కొని, పాత బ్యాట్ తీసి ‘రండి, ఆడుకుందాం‘ అని గ్రౌండ్‌కు తీసుకెళ్లాడు. పిల్లలిద్దరూ మొదట మారం చేశారు. రెండు రోజులయ్యాక బ్యాటింగ్ కిక్ నచ్చింది. సిక్స్ కొడితే వచ్చే ఆనందం ముందు పబ్జీ గేమ్ దిగదుడుపే అని వారిద్దరికీ అర్థమైంది. వారి తర్వాత కాలనీలోని పిల్లలందరూ ఒక్కొక్కరుగా చేరడంతో ఆ తండ్రి కాస్తా క్రికెట్ కోచ్‌గా మారిపోయాడు. ఇప్పుడు 60 మందికి పైగా పిల్లలకు క్రికెట్ నేర్పిస్తున్నాడు. 5 ఏళ్ల పిల్లాడి నుంచి 20 ఏళ్ల టీనేజర్ వరకు శిక్షణ పొందుతున్నారు.
ఫిట్‌నెస్ వచ్చింది
సెల్‌ఫోన్‌ను వీడి గ్రౌండ్‌లో ఆడుతూ ఫిట్‌నెస్‌తో ఉన్న తమ పిల్లలను చూసి తల్లిదండ్రులు సైతం సంతోషపడుతున్నారు. కోచ్ రతన్ వినోద్ దగ్గర కోచింగ్ సర్టిఫికెట్ లేదు. కానీ యూట్యూబ్‌లో చూసి బేసిక్స్ నేర్పిస్తాడు. పిల్లలు గ్రౌండ్‌లో ఉంటే డ్రగ్స్, చెడు అలవాట్ల వైపు వెళ్లరని అతని నమ్మకం. ఆయన వేసిన అడుగు 60 మంది పిల్లల జీవితాలను మార్చేసింది.
సెలవులు రాగానే ఫ్రెండ్స్ అంతా ఫోన్లలో గేమ్స్ ఆడుతున్నారు. కానీ నాకు గ్రౌండ్‌లో బ్యాట్ పట్టుకోవడమే ఇష్టం. పొద్దున 6 గంటలకు లేచి ప్రాక్టీస్‌కు వెళ్తే ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. ఫోన్ చూస్తే కళ్లు నొప్పి, క్రికెట్ ఆడితే సంతోషాన్నిస్తోంది.
– గౌతం గణేశ్ సింగ్, 9వ తరగతి, ఆర్మూర్
కొవిడ్ లాక్‌డౌన్‌లో కళ్ల ముందే పిల్లలు చెడిపోతుంటే చూస్తూ ఊరుకోలేక గ్రౌండ్‌కు తీసుకొచ్చా. వాళ్లతోపాటు కాలనీలోని మరికొంత మంది పిల్లల్ని కూడా పిలిచా. ఇప్పుడు రోజూ 60 మంది పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. సెల్‌ఫోన్‌ను మరిపించినందుకు సంతోషంగా ఉంది. – రతన్ వినోద్, క్రికెట్ కోచ్
నేను చిన్న క్లాసే. అయినా ఇక్కడ అన్నయ్యలతోపాటు ప్రాక్టీస్‌కు వస్తున్నా. టీవీలో కార్టూన్లు చూసే బదులు, నే నే హీరోలా బ్యాటింగ్ చేయా లని ఉంది. అమ్మ ఫోన్ ఇవ్వబోతే ‘వద్దు, బాల్ ఇవ్వు’ అని అడుగుతా. క్రికెట్ ఆడితే నిద్ర కూడా బాగా పడుతుంది.
– వొద్దాజి రోహన్ సూర్య, 6వ తరగతి, ఆర్మూర్
పదో తరగతికి వచ్చాను కదా అని ఫోన్‌న్‌లోనే ఉంటారని అమ్మ అనుకుంది. నేను మాత్రం కిట్ బ్యాగ్ భుజాన వేసుకొని గ్రౌండ్‌కు వెళ్తున్నా. స్క్రీన్ టైమ్ కంటే గ్రీన్ గ్రౌండ్ పైనే నాకు ప్రాణం. చెమట కాయలు కాసినా సరే, సెంచరీ కొట్టాలన్న కల కోసం కష్టపడుతున్నా.
– రతన్ విజ్ఞాన్, 10వ తరగతి, ఆర్మూర్
అమ్మాయిలు క్రికెట్ ఏంటి అన్నారు. కానీ నేను రోజూ ప్రాక్టీస్‌కు వస్తున్నా. డిగ్రీ చదువుతూ క్రికెట్ ఆడుతున్నా. ఇంట్లో వాళ్లు సీరియల్స్ చూస్తుంటే నేను గ్రౌండ్‌లో సిక్సర్లు కొడుతున్నా. ఫోన్ లో టైమ్‌పాస్ కన్నా క్రికెట్‌లో గోల్ రీచ్ అవ్వడం ముఖ్యం అనిపించింది.
– మాదిరే హాసిని, డిగ్రీ, ఆర్మూర్
మా ఇంట్లో అందరూ టీవీ సీ రియల్స్ చూస్తారు. నేను మా త్రం కోహ్లీ బ్యాటింగ్ వీడియోలు చూసి, మరుసటి రో జు నెట్స్‌లో ట్రై చేస్తా. ఇంటర్నెట్‌లో రీల్స్ చూసే టైమ్‌ను బౌలింగ్ ప్రాక్టీస్‌కు కేటాయించా. సమ్మర్ అయిపోయేలోపు బౌలింగ్ పర్ఫెక్ట్‌గా వేయడం నేర్చుకోవాలన్నదే నా టార్గెట్.
– మూసాల శషున్, 9వ తరగతి, ఆర్మూర్
ఆర్మూర్ క్రికెట్ అకాడమీలో
శిక్షణ పొందుతున్న చిన్నారులు
ఒకరితో మొదలై..
నేడు 60 మంది పిల్లలకు కోచింగ్


