చిన్నారి ఇంజినీర్లు..
ఎస్.సహస్ర ప్రకృతి
1వ తరగతి,
గ్రామం: దోమకొండ,
జిల్లా : కామారెడ్డి
హలో ఫ్రెండ్స్... నా పేరు యశ్వర్ధన్. మాది వినాయక్‌నగర్, నిజామాబాద్. నేను ప్రెసిడెన్సీ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాను. ఈ వే సవి సెలవుల్లో నాన్న ప్రవీణ్‌లాల్, అమ్మ అనిత, తమ్ముడితో కలిసి హైదరాబాద్ సందర్శించాను. స్నో వరల్డ్, వండర్‌లాకు వెళ్లి ఎంజాయ్ చేశాం. అనంతరం బిర్లా టెంపుల్ సందర్శించాము. సాయంత్రం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూశాను.
వేసవి సెలవుల్లో ఆట విడుపుగా ఈ చిన్నారులు ఇంజినీర్లు అయ్యారు. నైన్‌టీస్ కిడ్స్ అప్పట్లో పిట్టె గూళ్లు కడితే.. వీళ్లు ఏకంగా చిన్నపాటి బిల్డింగ్‌నే కట్టి మన్ననలు పొందుతున్నారు. ధర్మోర గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదివిన సాయిబాబా ఒక చిట్టి ఇంటిని నిర్మించాడు. మట్టితో చుట్టూ ప్రహరీ, ఇల్లు, మరుగుదొడ్డి నిర్మించడమే కాకుండా ఆకర్షించేలా టైల్స్ వేశాడు.


