అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు | - | Sakshi
Sakshi News home page

అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు

May 19 2026 2:10 AM | Updated on May 19 2026 2:10 AM

కామారెడ్డి క్రైం: భారీ చోరీ కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో రూ. 42.50 లక్షల వి లువైన సొత్తు రికవరీ చేయడంతోపాటు 32 కేసు లు, హిస్టరీ షీట్‌ కలిగిన నేరస్తుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్‌చంద్ర వివరాలు వె ల్లడించారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌ కాల నీలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో రాజంపేట ఎంపీడీవో అడ్డగుల్ల బాలకృష్ణ నివాసం ఉంటున్నారు. గత నెల 11 న వైద్య పరీక్షల నిమిత్తం కుటుంబంతో కలిసి ఫ్లాట్‌కు తాళం వేసి హైదరాబాద్‌ వెళ్లారు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూడగా ఇంట్లో దొంగలు పడ్డారు. అల్మారాలో భద్రపరిచిన 33 తు లాల బంగారు ఆభరణాలు, 10.290 కిలోల వెండి వస్తువులు, రూ.లక్ష నగదు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భారీ చోరీ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్‌ పర్యవేక్షణలో 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలు, సాంకేతిక పరిజ్ఞానం, ఇంటెలిజెన్స్‌ సమాచారం ఆధారంగా నిందితుడిని కరీంనగర్‌ జిల్లా అశోక్‌ నగర్‌ కాలనీకి చెందిన ఠా కూర్‌ జగన్‌ సింగ్‌ అలియాస్‌ దినేశ్‌ సింగ్‌ అలియాస్‌ డీజే డానీ అలియాస్‌ దినేశ్‌ రాజ్‌ పురోహిత్‌గా గుర్తించారు. దొంగిలించిన బంగారు ఆభరణాలను విక్రయించేందుకు హైదరాబాద్‌ నుంచి ముంబైకి ప్రయివేటు బస్సులో వెళ్తున్నాడనే సమాచారంతో కామారెడ్డి టౌన్‌, సీసీఎస్‌ పోలీసులు దాడులు చేపట్టి జాతీయ రహదారిపై చాకచక్యంగా అదుపులోకి తీ సుకున్నారు. నిందితుడు కామారెడ్డి, హైదరాబాద్‌, కరీంనగర్‌, గోవా, ముంబై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో సంచరిస్తూ, తాళం వేసి ఉన్న ఇళ్లను అదను చూసి చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. నిందితుడి నుంచి రూ.42.50 లక్షల విలువైన 145 గ్రాముల బంగారం, 5.700 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

32 కేసులు, హిస్టరీ షీట్‌..

నిందితుడు ఠాకూర్‌ జగన్‌సింగ్‌ పాత నేరస్తుడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని వివిధ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో నమోదైన మొత్తం 32 ఆస్తి దొంగతనం కేసులలో ప్రమేయం ఉన్న హిస్టరీ షీటర్‌ అని తేలింది. ఇతనికి 11 మంది సహచర నేరస్తులతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో అనేకసార్లు అరెస్ట్‌ అయి జైలుశిక్ష అనుభవించినప్పటికీ మళ్లీ నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైందని ఎస్పీ తెలిపారు. చోరీ చేసిన బంగారు ఆభరణాలను కరిగించి గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా విక్రయించడం లేదా ఫైనాన్స్‌ సంస్థల్లో కుదువ పెట్టి డబ్బు పొందేవాడు. ఆ డబ్బును వ్యసనాలకు ఖర్చు చేసేవాడు. నిందితుడిపై కరీంనగర్‌లో 15, సైబరాబాద్‌లో 10, వరంగల్‌లో 4, నిజామాబాద్‌లో 1, రామగుండం కమిషనరేట్‌లో 1, సంగారెడ్డిలో 1 కేసులు ఉన్నాయి. కేసు చేధించిన డీఎస్పీ మధుసూదన్‌, టౌన్‌ ఎస్‌హెచ్‌వో నరహరి, సీసీఎస్‌ సీఐ రామన్‌, ఎస్సైలు నాగరాజు, ఉస్మాన్‌, ఐటీ కోర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌, సిబ్బంది రంగారావు, కమలాకర్‌, సంపత్‌, రాజు, గణపతి, రాజేందర్‌, రవి, శ్రీనివాస్‌, చేతన్‌, రాజ్‌వీర్‌, లక్ష్మీకాంత్‌ను ఎస్పీ అభినందించారు.

భారీ చోరీ కేసును ఛేదించిన

కామారెడ్డి పోలీసులు

రూ. 42.50 లక్షల విలువైన

సొత్తు రికవరీ

నిందితుడిపై 32 కేసులు, హిస్టరీ షీట్‌

వివరాలు వెల్లడించిన

ఎస్పీ రాజేశ్‌చంద్ర

Advertisement
 
Advertisement
Advertisement