సుభాష్‌నగర్: వరదలు, విపత్తులు సంభవించిన సమయాల్లో చేపట్టాల్సిన తక్షణ చర్యలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల విషయంలో సన్నద్ధతను తెలుసుకునేందుకు వీలుగా సోమవారం చేపట్టిన మాక్ ఎక్సర్‌సైజ్ విజయవంతంగా కొనసాగింది. కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమాలు విపత్తుల నిర్వహణలో అన్ని విధాలుగా సమాయత్తమైన విషయాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించాయి. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్, ఖిల్లా రఘునాథ చెరువు వద్ద ఏకకాలంలో విపత్తుల నిర్వహణపై మాక్ ఎక్సర్‌సైజ్ చేపట్టారు. రఘునాథ చెరువు వద్ద జరిగిన కార్యక్రమాన్ని కలెక్టర్ ఇ లా త్రిపాఠి స్వయంగా పర్యవేక్షించారు. జీజీహెచ్ లో నిర్వహించిన మాక్ ఎక్సర్ సైజ్‌ను ఆర్డీవో రా జేంద్రకుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ నాగమోహన్ తదితరులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి రాష్ట్ర రెవె న్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించి జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కిరణ్‌కుమార్, దిలీప్‌కుమార్, అదనపు డీసీపీ శుభం నగ్రాలే, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పరమేశ్వర్, 7వ పోలీస్ బెటాలియన్ అధికారి సత్యనారాయణ, మత్స్య శాఖ సహాయ సంచాలకులు ఆంజనేయ స్వామి, జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి పవన్‌కుమార్, ఆర్‌అండ్‌బీ ఈఈ రంజిత్, శివకుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
పర్యవేక్షించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
జీజీహెచ్, రఘునాథ చెరువు
ప్రాంతాల్లో కొనసాగిన మాక్ డ్రిల్
సేవలు అందించిన ఎస్‌డీఆర్‌ఎఫ్,
ఎన్‌సీసీ, ఆపదమిత్ర వలంటీర్లు


