నిజామాబాద్ అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూ చించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదా య సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 150 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్లు కిరణ్‌కుమార్, దిలీప్‌కుమార్, డీఆర్‌వో గీత, డీఆర్డీవో సాయన్న, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్‌కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ లో భాగంగా ఈ నెల 22న నిర్వహించనున్న జిల్లా స్థాయి కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు.
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పో లీస్ ప్రజావాణికి 42 ఫిర్యాదులు వచ్చినట్లు సీపీ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదుదారులు తరలి వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు.


