పది | - | Sakshi
Sakshi News home page

పది

May 1 2026 4:04 AM | Updated on May 1 2026 4:04 AM

టర్నింగ్‌ పాయింట్‌లో విద్యార్థులు

తరువాత

లమైన అడుగులు వేద్దాం

ఖలీల్‌వాడి: పదో తరగతి పాసై టర్నింగ్‌ పాయింట్‌కు చేరుకున్న విద్యార్థులు పదిలమైన అడుగులు వేయాలి. పాఠశాల విద్యాభ్యాసం ఒక ఎత్తైతే.. ఇక నుంచి వేసే అడుగులు జీవితంలో మరో ఎత్తు. టెన్త్‌ క్లాస్‌ తర్వాత ఎంచుకునే కోర్సులు భవితకు దారి చూపిస్తాయి. పదో తరగతి పాసైన వారంతా ఇప్పుడు ఏం చేయాలి అనే అన్వేషణలో ఉన్నారు. ఏ కోర్సులో చేరితే బాగుంటుంది.. తమకు అనుకూలమైన కోర్సు ఏది.. ఏ కోర్సులో జాయిన్‌ అయితే ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు ఉంటాయి.. ఇ లా విద్యార్ధులకు ఎన్నో సందేహాలు ఉన్నాయి. దీంతోపాటు వారి కుటుంబసభ్యులు, బంధువులు, తల్లిదండ్రులు, గురువులు, సీనియర్ల సలహాలు సూ చనలు తీసుకుంటున్నారు. పదో తరగతి తర్వాత ఏ కోర్సులో చేరితే భవిష్యత్‌ అవకాశాలు, కోర్సు ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర వివరాలను ‘సాక్షి’ అందిస్తోంది. ఇంటర్మీడియట్‌తోపాటు పాలిటెక్నిక్‌, ఐటీఐ, అగ్రికల్చర్‌ డిప్లొమా, ఒకేషనల్‌ కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఎసీ, ఎంఈసీ గ్రూప్‌లో ఉన్నాయి. ఈ గ్రూప్‌లలో దేనికదే ఎంతో ప్రత్యేకమైంది. సాంకేతిక, వృత్తి నైపుణ్యాలు అందించే ఒకేషనల్‌ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఎంపీసీతో ఇంజినీరింగ్‌

ఎంపీసీలో ప్రధాన సబ్జెక్టులు మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ. ఈ గ్రూప్‌ అర్హత ఆధారంగా ఎంసెట్‌, జేఈఈ మెయిన్‌, జేఈఈ అడ్వాన్డ్స్‌ తదితర ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఇంజినీరింగ్‌ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంపీసీ విద్యార్థులు ఇంటర్‌ తర్వాత ఎన్డీఏ, 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీం వంటి పరీక్షల ద్వారా డిఫెన్స్‌ రంగంలో కెరీర్‌ అవకాశం ఉంటుంది. ఎంపీసీ విద్యార్థులు మ్యాథ్స్‌, సైనన్స్‌ కోర్సులతోపాటు ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌, లా సంబంధిత కోర్సుల్లోనూ చేరే అవకాశముంది.

హెచ్‌ఈసీతో పోటీ పరీక్షల్లో ముందంజ

సివిల్స్‌, గ్రూప్స్‌ వంటి పోటీ పరీక్షల్లో ముందంజలో నిలిపే గ్రూప్‌ హెచ్‌ఈసీ. హిస్టరీ, ఎకనామిక్స్‌, సివిక్స్‌ సబ్జెక్‌లు ఉంటాయి. వీటిపై పట్టు సాధించడం ద్వారా పలు ఉద్యోగ పోటీ పరీక్షల్లో సులభంగా విజయం సాధించవచ్చు. హెచ్‌ఐసీ అర్హతగా ప్రవేశం లభించే బీఏలోనూ జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రైవేట్‌ రంగంలోనూ ఉద్యోగావకాశాలను సొంతం చేసుకోవచ్చు.

ఐటీఐతో అవకాశాలు..

వృత్తి విద్య శిక్షణ, స్వయం ఉపాధికి ఐటీఐ. ఇండస్ట్రీయల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ (ఐటీఐ). నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ ట్రైనింగ్‌ పరిధిలోని ఐటీఐల్లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఫిట్టర్‌, రిఫ్రిజిరేషన్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ తదితర పదుల సంఖ్యలో బ్రాంచ్‌లు ఉన్నాయి. వీటిలో ప్రవేశాలకు సాధారణంగా ఏప్రిల్‌ నెలలో నోటిఫికేషన్‌ వెలువడుతుంది. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత పారిశ్రామిక సంస్థల్లో ఎంట్రీ లెవల్లో టెక్నీషియన్స్‌ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అప్రెంటీస్‌ షిప్‌ పూర్తి చేసి ఎన్సీవీటీ సర్టిఫికెట్‌ పొందితే ఉద్యోగ సాధనలో ముందంజలో ఉండొచ్చు.

ఎంఈసీతో విస్తృత అవకాశాలు

ఎంఈసీలో మ్యాథమెటిక్స్‌, ఎకనామిక్స్‌, కామర్స్‌ సబ్జెక్ట్‌లు ఉంటాయి. ఈ గ్రూప్‌లో ఇంటర్‌ పూర్తి చేస్తే ఇటు మ్యాథమెటిక్స్‌ అర్హతగా బీఎస్సీతోపాటు అటు కామర్స్‌ అర్హతగా బీకాం రెండు మార్గాలు అందుబాటులోకి వ స్తాయి. విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులో చేరే వీలుంటుంది. చార్టర్డ్‌ అకౌంటెన్సీ, కాస్ట్‌ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ కోర్సుల్లో రాణించే అవకాశం లభిస్తుంది. కంప్యుటేషనల్‌, కాలిక్యులేషనల్‌ స్కిల్స్‌ ఉన్న వారికి వివిధ కంపెనీల్లో అవకాశాలు ఉంటాయి.

ఒకేషనల్‌ కోర్సులు.. ఉపాధి వేదికలు

బైపీసీతో మెడిసిన్‌, ఇతర కోర్సులు..

ఇంటర్మీడియెట్‌ తర్వాత వెంటనే ఉపాధి మార్గాల్లో ఒకేషనల్‌ కోర్సులు ఉంటాయి. ఇందులో ఆఫీస్‌ అడ్మిస్ట్రేషన్‌షిప్‌ నుంచి ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ టెక్నీషియన్‌తోపాటు టెక్నికల్‌, అడ్మినిస్ట్రేషన్‌ విభాగాల్లో నైపుణ్యాలు అందించే కోర్సులు ఉన్నాయి. అగ్రికల్చర్‌, బిజినెస్‌ అండ్‌ కామర్స్‌, ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, హోంసైనన్స్‌, హ్యుమానిటీస్‌, పారా మెడికల్‌ విభాగాల్లో మొత్తం 27 ఒకేషనల్‌ కోర్సులు చేయడం ద్వారా సంబంధిత రంగాల్లో కోర్సులను అందిస్తున్నాయి. వీటిని పూర్తి స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

మెడిసిన్‌లో చేయాలనుకునే వారు బైపీసీలో చేరుతారు. బయోలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులు. ఇంటర్‌ బైపీసీ విద్యార్థులు జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌ యూజీ పరీక్షలో ర్యాంకు ద్వారా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్‌ తదితర మెడిసిన్‌, అనుబంధ కోర్సుల్లో చేరే అవకాశం ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో టీఎస్‌ ఎంసెట్‌ ఉత్తీర్ణత సాధించి వెటర్నరీ సైన్స్‌, అగ్రికల్చర్‌ సైనన్స్‌ వంటి విభాగాల్లోనూ బ్యాచిలర్‌ డిగ్రీ, ఆ తర్వాత పీజీ, పీహెచ్‌డీ చేసే అవకాశం ఉంటుంది. ఆగ్రికల్చర్‌ డిప్లొమా, వెటర్నరీ డిప్లొమా చేయొచ్చు.

ఆసక్తి, సామర్థ్యం ఆధారంగా కోర్సులు ఎంపిక చేసుకోవాల్సిందే..

ఎక్కువ మంది చేరేది ఇంటర్మీడియట్‌

టెక్నికల్‌ విభాగాల్లో ఉపాధికి

పాలిటెక్నిక్‌, ఐటీఐ

Advertisement
 
Advertisement
Advertisement