పరిశోధక విద్యార్థికి డాక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

పరిశోధక విద్యార్థికి డాక్టరేట్‌

Apr 1 2026 8:12 AM | Updated on Apr 1 2026 8:12 AM

పరిశోధక విద్యార్థికి డాక్టరేట్‌ న్యాయవాదుల సావనీర్‌ ఆవిష్కరణ ర్యాలీకి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలి

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ వృక్షశా స్త్ర విభాగం పరిశోధక విద్యార్థి దాసరి రఘు డాక్టరేట్‌ సాధించారు. తెయూ ప్రొ ఫెసర్‌ విద్యావర్థిని పర్యవేక్షణలో ఎన్హాన్స్‌మెంట్స్‌ ఆఫ్‌ క్వాంటిటేటివ్‌, క్వాలిటేటివ్‌ యీల్డ్‌, వయాబిలిటీ అండ్‌ లో జర్మినేషన్‌ రేట్‌ ఇన్‌ క్లియోమ్‌ విస్కోసా అండ్‌ క్లియోమ్‌ గైనండ్రా బై అప్లికేషన్‌ ఆఫ్‌ బ్రాస్సినోస్టిరైడ్స్‌’ అనే అంశంపై రఘు పరిశోధన పూర్తి చేసి సిద్ధాంత గ్రంథం సమర్పించారు. మంగళవారం ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినర్‌గా కేంద్రియ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ రాహుల్‌కుమార్‌ పరిశోధకుడిని పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. వృక్షశాస్త్ర విభాగాధిపతి హలీమ్‌ ఖాన్‌, తెయూ సైన్స్‌ డీన్‌ సంపత్‌ కుమార్‌, బీవోఎస్‌ చైర్‌పర్సన్‌ అరుణ, అధ్యాపకులు శ్రీనివాస్‌, జలంధర్‌, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.

నిజామాబాద్‌ లీగల్‌: నగరంలో మంగళవారం నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరానికి గాను న్యాయవాదుల సావనీర్‌ను జిల్లా జడ్జి జీవీఎన్‌ భారతలక్ష్మి ఆవిష్కరించారు. ఈసందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. గత సంవత్సర కాలంలో బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు, న్యాయవాదుల వివరాలతో రూపొందించిన సావనీర్‌ ఓ జ్ఞాపకంగా నిలిచిపోతుందని అన్నారు. సావనీర్‌ కమిటి అధ్యక్షుడు అమిడాల సుదర్శన్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు మామిళ్ల సాయిరెడ్డి, మాణిక్‌ రాజు, ఉపాధ్యక్షుడు రెంజర్ల సురేష్‌, సభ్యులు ప్రవీణ, అజీతా రెడ్డి, ఇంతియాజ్‌, ఆరెట్టి నారాయణ పాల్గొన్నారు.

సుభాష్‌నగర్‌: హనుమాన్‌ జయంతి సందర్భంగా జిల్లాకేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో నిర్వహించే శోభాయాత్ర, ర్యాలీలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పోలీస్‌ యంత్రాంగం చర్యలు చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌ పటేల్‌ కులాచారి ఒక ప్రకటనలో కోరారు. ఈమేరకు డీజీపీకి ఆయన లేఖ రాశారు. ఇందూరు పోలీస్‌ యంత్రాంగం వివిధ నిబంధనలను సాకుగా చూపుతూ ర్యాలీలను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాంతిభద్రతలను పర్యవేక్షించాలన్నారు. ర్యాలీలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో సాగేందుకు తగిన బందోబస్తు ఏర్పాటు చేసేలా స్థానిక పోలీసులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని దినేష్‌ పటేల్‌ కులాచారి డీజీపీని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement