సుభాష్‌నగర్: జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లల మరణాలను తగ్గించేందుకు వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్‌వో బీ రాజ శ్రీ పేర్కొన్నారు. కార్యాలయంలో ఐదేళ్లలోపు పిల్లల మరణాలపై ఆమె మంగళవారం సమీక్ష నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ వైద్యాధికారులు, వైద్య సిబ్బంది మెడికల్ నాలెడ్జిని పెంచుకుంటూ వైద్య సేవలను అందించాలన్నారు. సీ్త్రలు, చిన్నపిల్లల్లో ప్రమాదకర లక్షణాలను ముందే గుర్తించాలని, బాలింతలను నిరంతరం కలుస్తూ ఆరోగ్యస్థితిని పర్యవేక్షించాలన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతపై వివరించాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, పిల్లల ప్రాణాలను కాపాడే బాధ్యత తీసుకోవాలన్నారు. పిల్లల వైద్య నిపుణులు నిరూప్ రెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలపై దృష్టి సారించాలని, అనుబంధ ఆహారం, తల్లి పాలు, చెవి, ముక్కులో నూనె వేయడంతో కలిగే అనర్థాలను వివరించారు. సీ్త్ర వైద్యనిపుణులు రోహిణి మాట్లాడుతూ గర్భిణులకు 5 లేదా 6 గ్రాముల హెచ్‌బీ ఉంటే వారి పట్ల ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ఐరన్ సుక్రోజ్, న్యూట్రిషన్ అందించాలన్నారు. సమావేశంలో డీఐవో ఎం అశోక్, అనస్తటిస్ట్ సుజయ్ కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు అశ్విని, సమత, పీవోఎంసీహెచ్ శ్వేత, సీడీపీవోలు తదితరులు పాల్గొన్నారు.
క్షయ రహిత నిజామాబాద్‌గా తీర్చిదిద్దాలి
క్షయ రహిత నిజామాబాద్‌గా తీర్చిదిద్దడమే అందరి లక్ష్యమని డీఎంహెచ్‌వో రాజ శ్రీ తెలిపారు. టీబీఎంబీఏ 2.0 కార్యక్రమంపై మెడికల్ ఆఫీసర్లు, ఎంఎల్‌హెచ్‌పీలకు మంగళవారం శిక్షణనిచ్చారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో టీబీ నిర్మూలన లక్ష్యంగా ఆరోగ్య సిబ్బంది సమర్థవంతంగా పని చేయాలన్నారు. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు రెండో విడత ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలోభాగంగా జీవనశైలి వ్యాధులపై నిర్ధారణ పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తారని తెలిపారు. ఏప్రిల్ 6 నుంచి 11 వరకూ జాతి ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో కీటక జనీత వ్యా ధుల ప్రోగ్రాం అధికారి వినయ్ కుమార్, జిల్లా టీబీ అధికారి దేవి నాగేశ్వరి, మెడికల్ ఆఫీసర్ అవంతి, ఆరోగ్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
● సీ్త్రలు, చిన్నపిల్లల్లో ప్రమాదకర లక్షణాలను ముందే గుర్తించాలి
● అధికారులతో డీఎంహెచ్‌వో రాజశ్రీ సమీక్ష


