ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని ఖిల్లా వద్ద గల ఇంటర్మీడియట్ కార్యాల యంలో ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం క్యాంపు మంగళవారం ముగిసింది. ఈసందర్భంగా ప్రభుత్వ అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సయ్య మాట్లాడుతూ.. జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణ, మూ ల్యాంకనం విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. క్యాంపులో 3.45 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం కోసం కేటాయించారని,వాటిని పకడ్బందీగా,విజయంతంగా ఎలాంటి ఇబ్బందులు, తప్పులు దొర్లకుండా నిర్వహించడంతో ఇంటర్ విద్య పరీక్షల విభాగం నుంచి కూడా ప్రశంసించడం గర్వకారణమన్నారు. మూల్యాంకనం విజయవంతంగా పూర్తి చేయడంతో జిల్లా ప్రిన్సిపాళ్లకు, అధ్యాపకులకు డీఐఈవో కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డీఐఈవో రవికుమార్‌ను ఆధ్యాపకులు సన్మానం చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు జాఫర్, ప్రధాన కార్యదర్శి నారాయణ తదితరులు ఉన్నారు.
బోధన్ కోర్టులో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
బోధన్‌టౌన్(బోధన్): బోధన్ కోర్టు ఆవరణతోపాటు పరిసర ప్రాంతాల్లో మంగళవారం డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా కోర్టు ఆవరణతో పాటు పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు బృంద ప్రతినిధులు తెలిపారు.


