నిజామాబాద్ రూరల్: ఇందూరు యువత స్వచ్ఛంద సేవాసంస్థ చేస్తున్న సమాజ సేవలు అభినందనీయమని సీపీ సాయిచైతన్య అన్నారు. యువత సైతం ఇలాంటి సేవాకార్యక్రమంల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సుభాష్ నగర్‌లోని పెన్షనర్స్ భవన్‌లో సంస్థ ఆధ్వర్యంలో శనివారం అన్నదాన సేవ తత్పరత–2026 పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమాన్ని సీపీ ముఖ్య అతిథిగా హా జరై, జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగాఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. డీసీఎస్‌వో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సంస్థ సేవలు అమోగమన్నారు. సంస్థ ఆ ధ్వర్యంలో ఈనెల 28 నుంచి నెల రోజులపాటు అ నాథ వృద్ధులకు సపర్య సేవలు అందించనుండగా, కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులకు జ్ఞాపికలు అందజేశారు. సంస్థ ప్రతినిధులు మద్దుకూరి సాయిబాబు, బాలకిషన్, గంగాధర్, సుజాత రెడ్డి, విజయనంద్, యువి ఫౌండేషన్ ఫౌండర్ సుజన్ కుమార్, హన్మండ్లు, దర్శనం రాజు, కనకన్న, సుధాకర్, రఘు రాములు, సంతోష్, రాజ్‌కమార్ తదితరులు పాల్గొన్నారు.


