నేడు మున్సిపల్‌ కౌన్సిల్‌ తొలి సమావేశం | - | Sakshi
Sakshi News home page

నేడు మున్సిపల్‌ కౌన్సిల్‌ తొలి సమావేశం

Mar 28 2026 7:19 AM | Updated on Mar 28 2026 7:19 AM

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ నగర పాలక సంస్థ తొలి సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు మున్సిపల్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసినట్లు నగర మేయర్‌ కూరగాయల ఉమారాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీ 2026–27 సంవత్సరం ముసాయిదా అంచనా బడ్జెట్‌, 2025–26 సంవత్సరపు సవరణ బడ్జెట్‌ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశానికి సభ్యులందరూ సకాలంలో హాజరుకావాలని ఆమె కోరారు. కాగా, మున్సిపల్‌ కార్పొరేషన్‌ తొలి సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ హాజరుకానున్నారు.

కేశవ స్ఫూర్తి మందిర

గృహ ప్రవేశం

రెంజల్‌: కందకుర్తిలో ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్థాప కులు డాక్టర్‌ కేశవ్‌ బలిరాం హెడ్గేవార్‌ స్ఫూర్తి మందిరాన్ని శుక్రవారం లాంఛనగా ప్రారంభించారు. హెడ్గేవార్‌ పూర్వీకులు నివసించిన ప్రదేశంలో రూ. 30 కోట్లతో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. పనులు తుది దశకు చేరుకున్నా యి. శుక్రవారం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సంఘ్‌ అఖిల భారత వనవాసీ మార్గదర్శక్‌ సోమయాజులు ఈ స్ఫూర్తి మందిరంలో గృహప్రవేశం చేశారు.

వచ్చేనెలలో ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ రాక

వచ్చే నెల 11న ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌ కందకుర్తికి రానున్నారని సంఘ్‌ ప్రతినిధులు తెలిపారు. హెడ్గేవార్‌ స్ఫూర్తి మందిర ప్రారంభోత్సవంలో ఆయన తోపాటు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. గృహ ప్రవేశ కార్యక్రమంలో కేశవ సేవా సమితి ప్రతినిధులు సుధాకర్‌రెడ్డి, మల్లికార్జున్‌, శ్రీధర్‌రెడ్డి, వాసు పాల్గొన్నారు.

నిజాంసాగర్‌

నీరు విడుదల

నిజాంసాగర్‌: యాసంగి పంటల సాగు అవసరాల కోసం శుక్రవారం నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు. ఇప్పటివరకు నాలుగు విడతల్లో నీరందించారు. శుక్రవారం ఐదో విడత నీటి విడుదల ప్రారంభమైంది. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు 1,200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నామని నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు.

‘ఉపాధి భద్రత

కల్పించాలి’

కామారెడ్డి టౌన్‌ : వ్యవసాయ కూలీలకు ఉపాధి భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం కామారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చొద్దని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర కమిటీ ఎన్నిక

ఏఐపీకేఎంఎస్‌ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎం.కృష్ణ (నారాయణపేట్‌), ప్రధాన కార్యదర్శిగా పి.రామకృష్ణ (నిజామాబాద్‌), కోశాధికారిగా జి.కిషన్‌ (నిజామాబాద్‌), ఉపాధ్యక్షులుగా నాయిని రాజు(ఇల్లందు), ఎం వీరన్న (మహబూబాబాద్‌), కె.గంగాధర్‌(నిజామాబాద్‌), సహాయ కార్యదర్శులుగా ఎ.సలీం, బందెల వెంకయ్య, జాటోత్‌ కృష్ణ ఎన్నికయ్యారు. సమావేశంలో నాయకులు బి.కిశో ర్‌, రమేష్‌, ఎస్‌.కిశోర్‌, జి.ప్రభాకర్‌, కె.రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement