రేవంత్‌రెడ్డిపై అసత్య ఆరోపణలు సరికాదు | - | Sakshi
Sakshi News home page

రేవంత్‌రెడ్డిపై అసత్య ఆరోపణలు సరికాదు

Mar 27 2026 9:29 AM | Updated on Mar 27 2026 9:29 AM

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి బయటికి వెళ్తూ సీఎం రేవంత్‌రెడ్డి పై, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని రాష్ట్ర సహకార యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలం రాజకీయ జీవితం సాగించిన జీవన్‌రెడ్డి.. పార్టీని వీడి వెళ్తుండడంతో జాలితోపాటు బాధ కలుగుతోందన్నారు. తన అవసరాల కోసం పార్టీని వీడుతున్న ఆయన.. ఒకరిద్దరిపై అభాండాలు వేయాలని నిర్ణయించుకున్నారని విమర్శించారు. కేసీఆర్‌ రాక్షస పాలనకు వ్యతిరేకంగా పోరాడి ఇందిరమ్మ ప్రజాపాలనకు తిరిగి నాంది పలికిన రేవంత్‌రెడ్డి మీద పసలేని ఆరోపణలు చేయడం అసంబద్ధమన్నారు. రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకుని జీవన్‌రెడ్డికి గత ఎన్నికల్లో లోక్‌సభ టిక్కెట్‌ ఇచ్చేలా ఏఐసీసీని ఒప్పించార ని తెలిపారు. పార్టీ కోసం కష్టపడుతున్న తాము సైతం ప్రస్తుతం జగిత్యాల నియోజకవర్గం మాదిరి సమస్యను ఎదుర్కొంటున్నామని, అయినప్పటికీ కలిసి ప్రయా ణం చేస్తూ కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేస్తున్నామనే విషయం అందరికీ తెలుసన్నారు. ఇవన్నీ తెలిసినప్పటికీ జీవన్‌రెడ్డి గత పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎంపీగా నిలబడి బాల్కొండ అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోకి మానాల మోహ న్‌రెడ్డి, ఈరవత్రి అనిల్‌ రావొద్దని చెప్పిన విషయం మరు వొద్దన్నారు. బహుశా ఆరోజు బతుకొచ్చినోళ్లకు ఇంట్లో పుట్టిన వాళ్లన్న విషయం గుర్తురాలేదా అని మానాల ప్ర శ్నించారు. ఆరోజు తమ ఇబ్బంది గుర్తించి ఉంటే తాము గర్వపడేవాళ్లమన్నారు. నాడు తాము ఎదుర్కొన్న సమస్య విషయంలో ఒకలా వ్యవహరించి, నేడు అదే సమస్య మీకు ఎదురయ్యేసరికి మరోలా మాట్లాడడం జీవన్‌రెడ్డి వయసుకు, విజ్ఞతకు వదిలేస్తున్నామన్నారు. టికెట్‌ ఇవ్వకున్నా వేం నరేందర్‌రెడ్డి కాంగ్రెస్‌ ఉన్నతి, అభివృద్ధి కోసం పని చేశారన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్‌భూపాల్‌, జిల్లా ఫిషరీస్‌ చైర్మన్‌ బోర్గాం శ్రీనివాస్‌, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్‌, జగన్‌, సుమన్‌, సాయి, భాస్కర్‌ పాల్గొన్నారు.

జీవన్‌రెడ్డి విజ్ఞతతో మాట్లాడాలి..

గౌరవాన్ని తగ్గించుకోవద్దు

కేసీఆర్‌ రాక్షస పాలనపై నిరంతర

పోరాటం చేసిన వ్యక్తి రేవంత్‌

వేం నరేందర్‌రెడ్డి చేసిన సేవలకు

గుర్తింపుగానే రాజ్యసభ సభ్యత్వం

రాష్ట్ర సహకార యూనియన్‌

లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement