వేల్పూర్/కమ్మర్‌పల్లి: బాల్కొండ నియోజకవర్గం పరిధిలో పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్ పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు. ఇరిగేషన్‌కు సంబంధించిన ప్యాకేజీ 21, చిట్టాపూర్, ఫత్తేపూర్, సుర్బిర్యాల్ లిఫ్ట్ సమస్యలను సభలో లేవనెత్తారు. కాళేశ్వరం ప్యాకేజీ 20, 21, 21ఏ ద్వారా జిల్లాలో రెండు లక్షల ఎకరాకలకు నీరందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం పనులు చేపట్టిందన్నారు. ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలకు సంబంధించిన లిఫ్ట్‌లు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 20 శాతం పూర్తికాగా, రెండున్నరేళ్లుగా పనులు నిలిచిపోయాయన్నారు.


