సుభాష్‌నగర్: రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాల్లో ఐటీని విస్తరించాలని నిజామాబాద్ అర్బ న్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా కోరారు. ఐటీ, మున్సిపల్ అంశాలపై అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. గత ప్రభు త్వ హయాంలో నిజామాబాద్‌లో నిర్మించిన ఐటీ హబ్ నిరాదరణకు గురవుతోందన్నారు. అలాగే నగరంలోని రామర్తి, బొందెం చెరువులతోపాటు పూలాంగ్ వాగు సగానికి పై గా కబ్జా అవుతోందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రెండు చోట్ల ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేయాలని, ఫుట్‌పాత్ కబ్జాలపై దృష్టి సారించాలన్నారు. మాస్టర్ ప్లాన్ అమలు చేస్తే కబ్జాలను అరికట్టే అవకాశం ఉంటుందన్నారు.


