సుభాష్‌నగర్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (ఐఐహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ) గవర్నింగ్ కౌన్సిల్ చైర్‌పర్సన్‌గా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కవితారెడ్డిని మాజీ కార్పొరేటర్ ఎం.డీ సాబేర్ అలీ ఆధ్వర్యంలో ఫులాంగ్ కాలనీవాసులు బుధవారం సన్మానించారు. భవిష్యత్‌లో రాజకీయంగా మరిన్ని పదవులు అలంకరించాలని సాబేర్ అలీ ఆకాంక్షించారు. జిల్లాలో సీనియర్ వైద్యురాలైన కవితారెడ్డికి ఈ అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యేలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఎం.డీ అహ్మద్, నాయకులు హకీల్ అహ్మద్, టి శ్రీనివాస్, గురు దత్త, అంబం మురళీ, మసూద్, ఇజాజ్, అసద్ హందాన్, జావిద్, రషీద్, అన్వర్ బేగ్, ఫారూఖ్, తదితరులు పాల్గొన్నారు.
జక్రాన్‌పల్లి : మండలంలోని తొర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈవో శ్రీనివాస్‌ను గ్రామ ప్రజా ప్రతినిధులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఘనంగా సన్మానించారు. గ్రామ సర్పంచ్ పద్మ నాగరాజ్, ఉప సర్పంచ్ తెడ్డు మైపాల్, పాఠశాల చైర్మన్ గంగ జమునమనోహర్, మండల పీఆర్టీయూ అధ్యక్షులు గోపి, ప్రధాన కార్యదర్శి రవీణ్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఎర్రోళ్ల గంగాధర్, కార్యదర్శి చిక్కాల భూమేశ్వర్‌లు ఎంఈవో శ్రీనివాస్‌కు పూల మాలలు వేసి శాలువా కప్పి సత్కరించారు.


