● ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సంఘచాలక్
కాపర్తి గురుచరణం
● భగవద్గీత ఆన్‌లైన్ పరీక్ష
విజేతలకు బహుమతుల అందజేత
నిజామాబాద్ రూరల్: భగవద్గీత చాలా గొప్పదని ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సంఘచాలక్ కాపర్తి గురుచరణం అన్నారు. బుధవారం రాత్రి కేసీఆర్ కాలనీలోని ప్రైవేట్ గార్డెన్‌లో అంతర్జాతీయ ఇస్కాన్ కృష్ణ చైతన్యసమితి ఆధ్వర్యంలో ఇందూరు కంఠేశ్వర్ ప్రతినిధులు డిసెంబర్ నెలలో భగవద్గీతపై నిర్వహించిన ఆన్‌లైన్ పరీక్షలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రపంచం మొత్తం అశాంతి దిశగా యుద్ధాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణుడు భారతదేశంలో పుట్టడం మనం చేసుకున్న పుణ్యమని కంఠేశ్వర్ ఇస్కాన్ ప్రతినిధి రామానందరాయ్ ప్రభూజీ అన్నారు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన పోటీల్లో జిల్లా నుంచి మొత్తం 12వేల మంది వివిధ పాఠశాలల నుంచి పాల్గొన్నారని అన్నారు. విజేతలు శివామ్ష, స్నేహిత్, ప్రవీణ్, అక్షయ్‌కు బహుమతులు అందజేశారు. అంతకు ముందు యువతీయువకులు కృష్ణుని పాటలపై నిర్వహించిన నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో వేణుగోపాల్, మదాసు స్వామియాదవ్, కంఠేశ్వర్ ఇస్కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు.


