సుభాష్‌నగర్: నగరంలోని శ్రీనివాస్‌నగర్ కాలనీలో హనుమాన్ మందిరంలో ఏప్రిల్ 14న నిర్వహించే హిందూ సమ్మేళనం ఆహ్వాన పత్రికను ఆర్‌ఎస్‌ఎస్ నగర కార్యవాహ అర్గుల సత్యం బుధవారం రాత్రి ఆవిష్కరించారు. ఈసందర్భంగా అర్గుల సత్యం మాట్లాడుతూ హైందవ చైతన్యమే భారత సంక్షేమమని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సమ్మేళనం నిర్వహణ కమిటీ అధ్యక్షుడు పొల్కం శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి కొల్లూరు అశోక్‌కుమార్, ప్రతినిధులు రాజశేఖర్‌రెడ్డి, బిల్లా నవీన్, నల్లా అశోక్, ప్రవీణ్‌రెడ్డి, హనుమంత్‌రెడ్డి, గణేష్, విఠల్‌సుమన్, తదితరులు పాల్గొన్నారు.


