నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ జిల్లా న్యాయవాదుల సహకార సొసైటీకి 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను నూతన డైరెక్టర్స్, కార్యవర్గం ఎన్నికకుగాను ఎన్నికల అధికారులుగా మల్లెపూల జగన్ మోహన్ గౌడ్, పులి జైపాల్ లను నియమించారు. సొసైటీ అధ్యక్షుడు కే. శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ గౌడ్ వీరికి నియామాక పత్రాలను అందజేశారు. ఎన్నికల నిర్వహణ విధివిధానాలను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారని వారు తెలిపారు. సొసైటీలో మొత్తం 12 మంది డైరెక్టర్లు ఉన్నారని అందులో నలుగురి పదవికాలం ఏప్రిల్ నెలతో ముగుస్తున్నందున వాటికి ఎన్నికలు నిర్వహిస్తారు.


