నిజామాబాద్ రూరల్: నగరంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న రామాలయ బ్రహ్మోత్సవాలు రెండో రోజు బుధవారం ఉదయం 7 గంటలకు నిత్యారాధన, యాగశాల ప్రవేశం, ద్వారతోరణ, వాస్తు, సోమ, సుదర్శన, కుంభస్థాపన, అగ్నిప్రతిష్ట, వాస్తు హోమం, గరుడ ప్రతిష్ట, ధ్వజారోహణం, బలిహరణం, అరగింపు, తీర్థ గోష్టి కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమంలో ఆలయ చైర్‌పర్సన్ సరళామహేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శోభ నవీన్‌రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
మాచారెడ్డిలో..
మాచారెడ్డి: మండలంలోని పోలంపల్లి శాంతానంద తపోవన ఆశ్రమంలోని రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం విశ్వశాంతి మహా యజ్ఞాన్ని నిర్వహించారు. లోక కళ్యాణార్థం విశేషాలు నిర్వహించినట్లు నిర్వాహకుడు స్వామి తెలిపారు. ఆలయ ధర్మకర్త రాజమౌళి గుప్తా దంపతులు, గ్రామస్తులు ఉన్నారు.
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న ఎంఈడీ 3వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు బుధవారం ముగిసినట్లు అకడమిక్ ఆడిట్‌సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 29 మందికి 27 మంది హాజరు కాగా ఇద్దరు గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.
● సీపీ సాయిచైతన్య
నిజామాబాద్ అర్బన్: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కమిషనరేట్ పరిధిలోని పెండింగ్ నాన్ బెయిలెబుల్ వారెంట్లను తగ్గించినట్లు సీపీ సాయిచైతన్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్‌లలో గత కొన్ని రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న ఎన్‌బీడబ్ల్యూ కేసుల సంఖ్యను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారిపై ఉన్న ఎన్‌బీడబ్ల్యూకు సంబంధించి 3 కేసుల్లో లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో పరారీలో ఉన్న 9 మందిని, ఇతర జిల్లాల్లోని నలుగురు నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. నాలుగు రోజుల్లో మొత్తం 105 కేసులను పరిష్కరించామని, పాత 55 కేసుల్లో ఎన్‌బీడబ్ల్యూ వారెంట్లను క్లియర్ చేసినట్లు పేర్కొన్నారు.


