సుభాష్‌నగర్: రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కమిటీ సభ్యులందరం కలిసికట్టుగా పనిచేసి జెడ్పీపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని డీసీసీ అధ్యక్షుడు కాట్‌పల్లి నగేశ్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. బుధవారం నగరంలోని కాంగ్రెస్‌భవన్‌లో ఇటీవల నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులకు ఆయన నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ జిల్లా కమిటీలో అన్ని వర్గాల నాయకులకు జాతీయ, రాష్ట్ర నాయకత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కార్యదర్శులు పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే.. ప్రతిపక్ష పార్టీల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేందుకు కమిటీ సిద్ధంగా ఉందన్నారు. పార్టీ కోసం నిబద్ధతతో పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందని, ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని తెలిపారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్‌స్విప్ సాధించడం పక్కా అని, సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సూచనల మేరకే జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించామని, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నాయకత్వంలో పార్టీ మరింత ఉత్సాహంతో ముందుకెళ్తుందని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గడ్డం భక్తవత్సలం, కౌడపు శరత్, గొల్ల ఎర్రన్న, ప్రవీణ్‌కుమార్ గౌడ్, జయ లలిత, పైస ఎల్లయ్య, పవన్‌కుమార్, ముస్కు వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కమిటీలో అన్నివర్గాలకూ ప్రాధాన్యత
పార్టీ బలోపేతమే లక్ష్యంగా
ముందుకు సాగుతాం
జిల్లా కాంగ్రెస్ కమిటీ
అధ్యక్షుడు కాట్‌పల్లి నగేశ్‌రెడ్డి


