ఖలీల్‌వాడి: నేటి యువత పరిశోధనల వైపు ఆసక్తి చూపాలని, తద్వారా ఉ న్నత శిఖరాలను అధిరోహించవచ్చని సఫల ఆర్గానిక్స్ లిమిటెడ్ వ్యవస్థాపకు లు, శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ క ళాశాలలో మంగళవారం రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘నిర్మాణం నుంచి పునర్నిర్మాణం వరకు రసాయన శాస్త్రం: నూతన సంశ్లేషణను సమాజ స్థిరత్వంతో అనుసంధానం‘ అనే అంశంపై ఒక రోజు జాతీయ సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎల్లారెడ్డి మాట్లాడుతూ.. రసాయన శాస్త్రం అభ్యసించినవారు ఉన్నతంగానే ఎదిగుతారని తెలిపారు. ప్రి న్సిపల్ రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు లోతైన అవగాహన, పరి శోధన అనుభవం కలిగించుటకు ఈ విద్యా సంవత్సరంలో 5 జాతీయ సద స్సులు నిర్వహించామన్నారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచా ర్య దేవలపల్లి రామాచారి, ఐఐసీటీ హైదరాబాద్‌కు చెందిన సుధాకర్, తెయూ ప్రొఫెసర్ కాశీనాథ్, నాందేడ్ ప్రొఫెసర్ పట్వారీ, సాయిలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 61 పరిశోధన ప త్రాలు సమర్పించారు. దాదాపు 300 మంది రీసెర్చ్ స్కాలర్లు, విద్యా ర్థులు పాల్గొని, పేపర్ ప్రెజెంటేషన్, పోస్టర్ ప్రెజెంటేషన్, సైన్స్‌ఫేర్‌లను నిర్వహించారు. సదస్సు కన్వీనర్ రంగరత్నం, రాజేష్, అధ్యాపకులు ర మణ, రంజిత్, రాము, హనుమాండ్లు, చంద్రకళ, శ్రీవర్ష, దండు స్వామి, రామస్వామి, రామ్ కిషన్, ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


