జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న సీపీ సాయిచైతన్య
నిజామాబాద్ అర్బన్: స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ప్రతిరోజూ స్మరించుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల ప్రాణత్యాగానికి గుర్తుగా కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వశాఖ మేరా యువ భారత్ ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ మైదానంలో సీపీ జెండా ఊపి ప్రారంభించారు. ప్రాణ త్యాగానికి మించిన గొప్ప త్యాగం మరోటి ఉండదని, వేలాది మంది దేశంకోసం తమ ప్రాణాలను విడిచారన్నారు. జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్, మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ, సిబ్బంది పాల్గొన్నారు.


