రాష్ట్ర బడ్జెట్ రైతులకు, ప్రజలకు అనుకూలంగా ఉండటంతోపాటు సమగ్రాభివృద్ధికి దోహదపడుతుంది. మైనారిటీల సంక్షేమానికి రూ.3,769 కోట్లు కేటాయించడం హర్షణీయం. గతేడాదితో పోలిస్తే రూ.178 కోట్ల పెరుగుదల ఉండటం, మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను సూచిస్తుంది. మైనారిటీ మహిళలకు 10,000 కుట్టు యంత్రాల పంపిణీ, 4,655 మంది మైనారిటీ యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ వంటి కార్యక్రమాలు ఆర్థిక స్వావలంబనను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
– షబ్బీర్ అలీ, ప్రభుత్వ సలహాదారు


