నిజామాబాద్ రూరల్: ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్లేందుకు ఈ బడ్జెట్ నిదర్శనం. విద్యా, వైద్యం, వ్యవసాయానికి పెద్దపీట వేశారు. ఇది పూర్తిగా బడుగు, బలహీనవర్గాల బడ్జెట్. వ్యవసాయానికి రూ.23,179 కోట్లు కేటాయించి రైతు సంక్షేమమే తమ ధ్యేయమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ జీవిత బీమా పథకం హర్షణీయం. 119 నియోజకవర్గాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరు చేయడం అభినందనీయం. – కాటిపల్లి నగేశ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు


