రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా నిస్సారంగా ఉంది. ఇందూరు జిల్లాకు పూర్తి అన్యాయం చేశారు. జిల్లాకు గుండు సున్నా అన్నట్లుగా బడ్జెట్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసింది. మహిళలకు, యువతకు ఇస్తామని చెప్పిన పథకాల ఊసే లేదు. ప్రతి కుటుంబానికి ఈ ప్రభుత్వం రూ.3 లక్షల బాకీ ఉంది. ఇక సీఎం చెప్పిన నిజామాబాద్ రింగ్ రోడ్డు ఊసేలేకుండా పోయింది. నిజాంషుగర్స్, సారంగాపూర్ సహకార చక్కెర ఫ్యాక్టరీ ప్రస్తావనే లేదు. ఇది అందరినీ మోసం చేసే బడ్జెట్.
– కులాచారి దినేశ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు


