రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని రంగాలను విస్మరించినట్లే ఉంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా అంకెల గారడీ ప్రదర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సమయం వృథా చేస్తున్నారు. మహిళలు, దివ్యాంగులకు పెంచుతామన్న పింఛను మాటే తీయలేదు. రెండేళ్లుగా సీడీపీ నిధులు ఇవ్వలేదు. ప్రస్తుత బడ్జెట్ పేపర్‌పై గ్రాండ్‌గా ఉంది. గ్రౌండ్‌లో మాత్రం బ్లాంక్‌గానే ఉంది.
– ధన్‌పాల్ సూర్యనారాయణ,
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే


