ఇప్పుడు సస్పెన్షన్‌.. తర్వాత తొలగింపు! | - | Sakshi
Sakshi News home page

ఇప్పుడు సస్పెన్షన్‌.. తర్వాత తొలగింపు!

Mar 21 2026 5:24 AM | Updated on Mar 21 2026 5:24 AM

తెలంగాణ డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ సూ చనల మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో డీ ఈవో అశోక్‌ శుక్రవారం సీఎస్‌, డీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో పాటించాల్సిన నిబంధనలు వివరించారు.

● పరీక్ష కేంద్రాల్లో క్లర్కులుగా ఇతర సబ్జెక్టు టీచర్లను నియమించొద్దు. జూనియర్‌ అసిస్టెంట్లను నియమించుకోవాలి.

● క్లర్క్‌లు, రిజర్వ్‌ ఇన్విజిలేటర్లు సీసీ కెమెరా పర్యవేక్షణలో మాత్రమే కూర్చొని ఉండాలి. విద్యార్థుల దగ్గర, కారిడార్లలో తిరగరాదు.

● హాల్‌టికెట్‌ నంబర్లను ప్రశ్నాపత్రంలోని అన్ని పేజీలపై తప్పనిసరిగా రాయించాలి.

● ఇంగ్లిష్‌ పరీక్షలో పార్ట్‌–ఏ, పార్ట్‌–బీ ఆన్సర్‌ బుక్స్‌ను ఉదయం 9.30 గంటలకు కట్టించాలి.

● ప్రయివేట్‌ స్కూల్‌ సిబ్బంది పరీక్షా కేంద్రాలలో లేదా పరిసర ప్రాంతాలలో ఉండొద్దు.

● సీఎస్‌, డీవోతోపాటు సెంటర్‌లో విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరి మొబైల్‌ ట్రాకింగ్‌ జరుగుతుంది. అందరి ఫోన్‌లు సెంటర్‌లోకి తీసుకురాకుండా నిషేధం విధించారు.

● ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ చేసినప్పటికీ ట్రాకింగ్‌ జరుగుతుంది.

● ప్రతి ఎగ్జామినేషన్‌ సిబ్బంది రోజువారీగా డిక్లరేషన్‌ ఇవ్వాలి. చీఫ్‌ సూపరింటెండెంట్‌ డిక్లరేషన్‌ రిజిస్టర్‌ను నిర్వహించాలి.

● ప్రతి సెంటర్‌లో క్లాక్‌ రూమ్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.

ఖలీల్‌వాడి: జిల్లాలోని ఆలూర్‌, మెండోరాలో పదో తరగతి హిందీ, తెలుగు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రం వాట్సాప్‌ ద్వారా బయటకు వెళ్లడంతో ఏడుగురు టీచర్లను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే, శాఖాపరమైన విచారణ జరిపి వారిని విధుల నుంచి తొలిగించేందుకు పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ నుంచి పలు సూచనలు వచ్చినట్లు తెలిసింది. ఆలూర్‌ ఘటనకు సంబంధించి నలుగురు టీచర్లపై ఆర్మూర్‌ పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. కాగా మెండోరా పరీక్ష కేంద్రంలో మాస్‌కాపీయింగ్‌కు సహకరించిన ముగ్గురు టీచర్లపై కేసు నమోదు కాలేదు. శాఖాపరమైన చర్యల్లో భాగంగా సస్పెండ్‌ చేశారు. అయితే, భవిష్యత్తులో మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా ఉండేందుకు విద్యాశాఖ కొత్త చట్టం రూపొందిస్తున్నట్లు తెలిసింది. కాపీయింగ్‌కు సహకరించిన వారిని సర్వీస్‌ నుంచి తొలగించేలా నిబంధన తీసుకురానున్నట్లు సమాచారం.

ఆరు నెలలపాటు సస్పెన్షన్‌?

మాస్‌ కాపీయింగ్‌ ఘటనలో ఏడుగురు ఉద్యోగులపై కొనసాగుతున్న సస్పెషన్‌ ఎత్తివేతకు తనను కలువొద్దని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఉపాధ్యాయ సంఘాల నేతలకు సూచించినట్లు తెలిసింది. దీంతో సదరు టీచర్లపై ఆరునెలలపాటు సస్పెన్షన్‌ కొనసాగుతుందని విద్యాశాఖలో చర్చ జరుగుతోంది.

ఆబ్జెక్టీవ్‌ ప్రశ్నలకు జవాబులు..

జిల్లాలో పదో తరగతి పరీక్షలకు ప్రయివేట్‌ పాఠశాలకు చెందిన 10 వేలకు పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ పరీక్ష కేంద్రాలకు వెళ్లే సీఎస్‌, డీవోలతోపాటు ఇన్విజిలేటర్లను పాఠశాలల యాజమాన్యాలు మచ్చిక చేసుకుంటున్నాయి. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచుకోవడానికి ఆబ్జెక్టీవ్‌ ప్రశ్నలకు జవాబులు అందించేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రయివేట్‌ పాఠశాలల్లో నిర్వహించే కేంద్రాలపై అధికారులు దృష్టి సారించాలని విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు.

నిబంధనలు పాటించాలి

పదో తరగతి పరీక్షల్లో

మాస్‌కాపీయింగ్‌ నేపథ్యంలో..

ఆర్మూర్‌లో కేసు నమోదు..

మెండోరాలో సైలెంట్‌

చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లతో డీఈవో సమీక్ష

అమల్లోకి మొబైల్‌ ట్రాకింగ్‌ విధానం

సస్పెండ్‌ అయిన టీచర్ల కోసం

రావొద్దని కలెక్టర్‌ స్పష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement