సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్‌ను శుక్రవారం ప్రవేశపెట్టారు. బడ్జెట్‌కు సంబంధించి జిల్లావాసులు ఎదురుచూసిన జక్రాన్‌పల్లి విమానాశ్రయం ఊసే లేకపోవడంతో నిరాశ నెలకొంది. వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల గురించి ప్రస్తావించి జక్రాన్‌పల్లి విమానాశ్రయాన్ని పట్టించుకోకపోవడం ఏమిటంటూ విమర్శలు వస్తున్నాయి. ఇక కీలకమైన నిజాంషుగర్స్ విషయమై బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. జిల్లాలో చెరుకు పండించేలా రైతులను ప్రోత్సహించే దిశగా ప్రణాళికలు చేస్తే బాగుండేదని పలువురు అంటున్నా రు. ఇక ఉత్తర తెలంగాణలోనే కీలకమైన శ్రీరాంసాగర్ జలాశయంలో పూడికతీత విషయమై పట్టించుకోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
● ఇటీవల జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించిన నిజామాబాద్ చుట్టూ రింగ్‌రోడ్డు ఏర్పాటు విషయమై బడ్జెట్‌లో ప్రస్తావించలేదంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. ఇందూరు నగర సుందరీకరణ విషయమై నిధులు కేటాయించలేదంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద బడ్జెట్ విషయమై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. అధికార కాంగ్రెస్ నేతలు అన్నివర్గాల సంక్షేమ, అభివృద్ధి బడ్జెట్ అంటూ చెబుతుండగా, విపక్ష నాయకులు మాత్రం నిరాశజనక బడ్జెట్ అంటూ విమర్శలు చేస్తున్నారు.
నిజాం షుగర్స్ ప్రస్తావన కరువు
శ్రీరాంసాగర్ పూడికతీతపై పట్టింపే లేదు
ఇందూరు రింగ్ రోడ్డునూ
బడ్జెట్‌లో చూపలేదు
రాష్ట్ర బడ్జెట్‌పై వివిధ వర్గాల్లో
భిన్నాభిప్రాయాలు
అన్నివర్గాలకు మేలు చేసే బడ్జెట్
అంటున్న అధికార కాంగ్రెస్
నేతలు
నిరాశాజనక బడ్జెట్ అని
విపక్షాల విమర్శలు


