మాక్లూర్: విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని, వంట గదిలో ఆహార పదార్థాలు కలుషితం కాకుండా జాగ్రత్త పడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. శుక్రవారం మాక్లూర్ మండలం దా స్‌నగర్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిబాఫూలే బాలిక ల గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తని ఖీ చేశారు. వంట గదితోపాటు తరగతి గదులను పరిశీలించారు. రోజువారీ వ్యర్థాలను ఎక్కడికి తరలిస్తున్నారనేది తెలుసుకొని వెంటనే సంబంధిత అ ధికారులకు ఫోన్ చేసి చెత్తను తీసుకెళ్లే వాహనాన్ని రోజూ పాఠశాలకు పంపించాలని ఆదేశించారు. వంటకు తాజా కూరగాయలు, బ్రాండెడ్ సరుకులు మాత్రమే వాడాలని, ఈ విషయంలో కక్కుర్తి చూపితే సహించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు పుష్టిగా భోజనం చేసి ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువు, క్రీడలు ఇతర అంశాలపై చక్కగా దృష్టిపెట్టగలుగుతారని అన్నారు.
వైద్య శిబిరం సందర్శన
ప్రజాపాలనలో భాగంగా ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాల ప్రాంగణంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన ఆరోగ్య శిబిరాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించి బాలికలకు అందిస్తున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా విద్యార్థులు వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. చక్కని ఆరోగ్యం కోసం తాజా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలన్నారు. గురుకులంలో ఉండే విద్యార్థులు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వెంటనే ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఒత్తిడికి గురి కాకుండా వార్షిక పరీక్షలను ఆత్మవిశ్వాసంతో రాయాలన్నారు. బయటి వ్యక్తులు ఎవరూ పాఠశాలలోనికి రాకుండా గట్టి పర్యవేక్షణ చేయాల ని ప్రిన్సిపల్ స్వప్నను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్‌వో రాజశ్రీ, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్వేత, వైద్యులు సందీప్, శశిధర్, అరవింద్ ఉన్నారు.
ఆహార పదార్థాలు
కలుషితం కాకుండా చూడాలి
బ్రాండెడ్ సరుకులు వాడాలి
కలెక్టర్ ఇలా త్రిపాఠి
మహాత్మా జ్యోతిబాఫూలే పాఠశాల తనిఖీ


