ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలి

Mar 21 2026 5:24 AM | Updated on Mar 21 2026 5:24 AM

ఫిర్యాదులను త్వరితగతిన

పరిష్కరించాలి

సీపీ సాయిచైతన్య

మోపాల్‌ పీఎస్‌ తనిఖీ

నిజామాబాద్‌ రూరల్‌: ప్రజలతో మరింత స్నేహపూర్వకంగా మెలగాలని కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సాయి చైతన్య పేర్కొన్నారు. మోపాల్‌ మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌ను ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సీపీ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డుల నిర్వహణ, ఫిర్యాదుల పరిష్కారం, భద్రతా చర్యలు, సిబ్బంది పనితీరును సమీక్షించారు. అనంతరం సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. మండలంలో శాంతి భద్రతలను కట్టుదిట్టంగా నిర్వహిస్తూ, ప్రజల విశ్వాసాన్ని పెంపొందించేలా పని చేయాలని ఆదేశించారు. అనంతరం స్టేషన్‌కు సంబంధించిన వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సీపీ వెంట నిజామాబాద్‌ సౌత్‌ రూరల్‌ సీఐ సురేశ్‌ కుమార్‌, ఎస్సై జెడ్‌ సుస్మిత, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement