అర్హులు ఓటరుగా నమోదు చేసుకోవాలి
సుభాష్‌నగర్: 18 ఏళ్లు నిండి అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఆదివారం నగరంలోని పాత కలెక్టరేట్ మైదానం నుంచి చేపట్టిన 2కే రన్‌ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా దిలీప్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో మంచి నాయకులను ఎన్నుకోవడానికి ప్రతి ఓటు కీలకమైందన్నారు. అదనపు కమిషనర్ రవీందర్ సాగర్, ఎలక్షన్ సెల్ అధికారులు అబ్దుల్ మాజిద్, నజీరుద్దీన్, వార్డు ఆఫీసర్లు, జవాన్లు, విద్యార్థులు పాల్గొన్నారు.


