శ్రీవారిని దర్శించుకున్న సీపీ
మోపాల్: మండలంలోని నర్సింగ్‌పల్లిలో ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం రాత్రి నిర్వహించే విశేష ఏకాంత సేవలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య దంపతులు పాల్గొని స్వామి వారి వింజమర సేవ చేశారు. ఆలయం అద్భుతంగా ఉందని, తిరుమలలో ఉన్నట్లు అనుభూతి పొందానని సీపీ పేర్కొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు రోహిత్ కుమార్ ఆచార్య సీపీ దంపతులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రతినిధులు నరాల సుధాకర్, విజయ్ స్వామి, అనిల్ స్వామి, భాస్కర్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


