మోహన్‌రావు కుటుంబానికి పరామర్శ
డిచ్‌పల్లి: మండల కేంద్రంలో ఇటీవల మృతిచెందిన డిచ్‌పల్లి సొసైటీ మాజీ చైర్మన్ కులాచారి మోహన్‌రావు కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు శుక్రవారం పరామర్శించారు. మోహన్‌రావు కుమారుడు, నడిపల్లి మాజీ సర్పంచ్ సతీశ్‌రావు, కుటుంబసభ్యులైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేశ్‌ను ఆయన పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన వెంట నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్, పానుగంటి సతీశ్‌రెడ్డి, చంద్రకాంత్, పద్మరెడ్డి, లక్ష్మీనారాయణ, రాజేశ్వర్, కులాచారి శ్యాంరావు, వినోద్ రెడ్డి, సురేశ్, సాయిచరణ్ తదితరులు ఉన్నారు.
త్వరలో బీజేపీ సర్పంచులకు సన్మానం
రాష్ట్రంలో ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికలలో బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లను త్వరలో హైదరాబాద్‌కు పిలిపించి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి సన్మానం చేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు తెలిపారు. అలాగే రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలోనూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పని చేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపు నిచ్చారు.
నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ కార్యాలయంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను జిల్లా అధ్యక్షుడు సుమన్, జిల్లా కార్యదర్శి శేఖర్ అధ్యక్షతన శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్ కట్ చేశారు. పాస్టర్ కృపాకర్ మాట్లాడుతూ.. క్రిస్మస్ వేడుకలను టీఎన్జీవోస్ సంఘంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గైని గంగారాం, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, క్రైస్తవులు శ్రీనివాస్, శ్యామ్, జగన్ తదితరులు పాల్గొన్నారు.
భిక్కనూరు: మండలంలోని అంతంపల్లి గ్రామానికి చెందిన గోల్కొండ లక్ష్మి (74) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందింది. లక్ష్మి కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆమె నేత్రాలను కంటి వైద్య నిపుణులు లింబాద్రి సేకరించారు. ఈ సందర్భంగా నేత్రదానానికి ముందుకు వచ్చిన లక్ష్మి కుటుంబ సభ్యులను గ్రామస్తులతోపాటు మండల వాసులు అభినందించారు. లక్ష్మి కుమార్తె రంజిత నేత్ర వైద్యురాలిగా పనిచేస్తున్నారు. లక్ష్మి మరణించినా మరొకరికి చూపు కలిగించారని ఇది ఎంతో గొప్ప విషయమని వైద్యులు అన్నారు.
మోహన్‌రావు కుటుంబానికి పరామర్శ
మోహన్‌రావు కుటుంబానికి పరామర్శ


