గ్రూప్–3లో నూత్‌పల్లి వాసికి 291 ర్యాంకు
● రాష్ట్ర ఆర్థిక శాఖలో సీనియర్
అకౌంటెంట్‌గా ఉద్యోగం
డొంకేశ్వర్: గ్రూప్–3 ఫలితాల్లో డొంకేశ్వర్ మండలం నూత్‌పల్లి గ్రామానికి చెందిన శంకూరి రాజ్‌కుమార్ రెడ్డి 291 ర్యాంకు సాధించారు. ఈ ర్యాంక్‌తో రాష్ట్ర ఆర్థిక శాఖ హైదరాబాద్‌లో సీనియర్ అకౌంటెంట్ ట్రెజరీ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చింది. రాజ్ కుమార్‌ది రైతు కుటుంబం. టెన్త్, ఇంటర్‌లో మంచి మార్కులు సాధించాడు. బీటెక్, ఇతర ఉన్నత విద్యను అభ్యసించి రెండేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు. జాబ్ చేస్తూనే సివిల్స్, గ్రూప్–1, 2 పరీక్షలకు సిద్ధమై పరీక్షలు రాయగా అనుకున్న ర్యాంక్ రాలేదు. ఇటీవల గ్రూప్–3 పరీక్ష రాయగా 291 ర్యాంక్ రావడంతో రాష్ట్ర ఆర్థిక శాఖలో ప్రభుత్వ ఉద్యోగం వరించింది. ఈ సందర్భంగా రాజ్‌కుమార్‌ను కుటుంబ సభ్యులు, స్నేహితులు అభినందించారు.


