సైన్స్‌ఫేర్‌తో పరిశోధన శక్తి పెరుగుతుంది
ఖలీల్‌వాడి: సైన్స్‌ఫేర్‌తో విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనాశక్తి, సృజనాత్మకత తోపాటు పరిశోధనాత్మక శక్తి పెరుగుతుందని టీయూ రిజిస్ట్రార్ యాదగిరి, ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ అన్నారు. నగరంలోని వినాయక్‌నగర్‌లో ఉన్న బస్వాగార్డెన్‌లో అగస్త్య ఫౌండేషన్ సభ్యులు రెండు రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర స్థాయి సైన్స్‌ఫేర్‌ను ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడారు. సైన్స్‌ఫేర్‌లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ శాసీ్త్రయ ప్రాజెక్టులు, వినూత్న ఆవిష్కరణల తోపాటు నమూనాలను ప్రదర్శించారు. పర్యావరణ పరిరక్షణ, నూతన శక్తి వనరులు, ఆరోగ్యం, వ్యవసాయం, సాంకేతికత వంటి అనేక అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులు ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో అగస్త్య ఫౌండేషన్ నిర్వాహకులు గడ్డం శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు ఉన్నారు.


