క్రీడలతో మానసికోల్లాసం
● ఏసీపీ శ్రీనివాస్
బోధన్‌టౌన్: క్రీడలు మానసికోల్లాసానికి దోహద పడతాయని ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో జిల్లా స్థాయి స్పోర్ట్ మీట్–3ని ప్రారంభించారు. విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నిర్వహింగా ముఖ్య అతిథులు గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవో నాగయ్య, మైనారిటీ గురుకుల విజిలెన్స్ ఆఫీసర్ జియా హఫీజ్, పీఆర్టీయూ రాష్ట్ర బాధ్యులు ఎంబెల్లి శంకర్, ప్రధాన కార్యదర్శులు ధన్‌రాజ్, గంగాధర్, ఎస్టీయూ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సంజీవ్, సలీం, తపస్ బాధ్యులు సలీం, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పాషా మొయినొద్దీన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


