పని ఒత్తిడితో బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య
బాన్సువాడ: పని ఒత్తిడితో బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బాన్సువాడలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవింద్‌పూర్ గ్రామా నికి చెందిన కస్తూరి సంగమేశ్వర్ (36) మహమ్మద్‌నగర్‌లోని యూనియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 18న డ్యూటీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన సంగమేశ్వర్ మొగులాన్‌పల్లి శివారులోని అటవీ ప్రాంతంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు శుక్రవారం గుర్తించారు. తన భర్త కొంత కాలంగా పని ఒత్తిడితో మానసిన ఆందోళనకు గురవుతున్నారని, పని ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు సీఐ సీఐ శ్రీధర్ తెలిపారు.
పెద్దకొడప్‌గల్(జుక్కల్): విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి చెందిన ఘటన మండలంలోని లింగంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై అరుణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పూరి మోహిని(24) అనే మహిళ శుక్రవారం ఉదయం ఉతికిన బట్టలను తన ఇంటి పై భాగంలో ఉన్న ఇనుప సలాకాలకు ఆరేస్తుండగా విద్యుత్‌షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి తల్లి గిరి ఉషాబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రుద్రూర్: కోటగిరి మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్‌కు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గురువారం రాత్రి విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, సివిల్ సప్‌లై అధికారులు పట్టుకున్నారు. ఆటోలో తీసుకొచ్చిన బియ్యం ఓ రైస్ మిల్‌లోకి తీసుకెళ్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు దాడి చేసి ఎనిమిది క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాడిలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్సై శశికాంత్ రెడ్డి, సిబ్బంది మహేశ్, పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి: మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీకి చెందిన ఓ వివాహిత అదృశ్యమైనట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. గురువారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరగడంతో 10.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పని ఒత్తిడితో బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య


