వణుకుతున్న విద్యార్థి | - | Sakshi
Sakshi News home page

వణుకుతున్న విద్యార్థి

Dec 20 2025 9:23 AM | Updated on Dec 20 2025 9:23 AM

వణుకు

వణుకుతున్న విద్యార్థి

న్యూస్‌రీల్‌

నిజామాబాద్‌

కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి

22న విపత్తుల నిర్వహణపై

అవగాహన కార్యక్రమం

నూతన ఆవిష్కరణలకు..

మేధోసంపత్తి హక్కులతోనే నూతన ఆవిష్కరణలకు రక్షణ లభిస్తుందని సీఎస్‌ఐఆర్‌–ఐఐసీటీ సైంటిస్ట్‌ గుర్రపురాజు పేర్కొన్నారు.

శనివారం శ్రీ 20 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

–10లో u

లోక్‌అదాలత్‌ను

సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా జడ్జి జీవీఎన్‌ భారతలక్ష్మి

నిజామాబాద్‌ లీగల్‌: జిల్లాలోని కోర్టుల్లో ఈ నెల 21న నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతలక్ష్మి సూచించారు. శుక్రవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇంచార్జి కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి సాయిసుధతో కలిసి జడ్జి మీడియాతో మాట్లాడారు. జాతీయ లోక్‌అదాలత్‌కు నిజామాబాద్‌లో తొమ్మిది, బోధన్‌లో నాలుగు, ఆర్మూర్‌లో రెండు బెంచ్‌లు ఏర్పాటు చేశామన్నారు. కక్షిదారులు పట్టువిడుపు ధోరణితో వ్యవహరించి కేసులు పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 15 బెంచ్‌లు పనిచేస్తాయని తెలిపారు. లోక్‌ అదాలత్‌లో సివిల్‌, క్రిమినల్‌, బ్యాంకు, మోటారు వాహన బీమా, మునిసిపల్‌, ప్రీ లిటిగేషన్‌ కేసులను పరిష్కరించుకోవాలన్నారు.

క్రిస్మస్‌ వేడుకలు

నిజామాబాద్‌ అర్బన్‌: కలెక్టరేట్‌ కార్యాలయంలో శుక్రవారం రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ జీసస్‌ మార్గంలో సత్యము ఉందన్నారు. ప్రజలందరూ మంచిమార్గంలో నడిస్తే సుఖ సంతోషాలతో ఉంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామన్‌ రెడ్డి, అసోసియేట్‌ అధ్యక్షుడు శ్రీనివాసరావు, కోశాధికారి విజయకాంత్‌ రావు, కలెక్టరేట్‌ ఏవో ప్రశాంత్‌, ఉపాధ్యక్షులు భూపతి ప్రభువు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

పాతికేళ్ల అజ్ఞాత

జీవితానికి వీడ్కోలు!

పోలీసులకు లొంగిపోయిన

ఎర్రగొల్ల రవి

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రెండున్నర దశా బ్దాల పాటు విప్లవోద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఎర్రగొల్ల రవి అలియాస్‌ సంతోష్‌ ఎట్టకేలకు జనజీవన స్రవంతిలో కలిశాడు. పాతికేళ్ల ఉద్యమ ప్రస్థానానికి వీడ్కోలు పలికి శుక్రవారం హైదరాబాద్‌లో డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట తన సహచరులతో కలిసి లొంగిపోయాడు. పాల్వంచ మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన ఎర్రగొల్ల రవికి 2001 లో కామారెడ్డి పట్టణంలోని జీవీఎస్‌ జూనియర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న సమయంలో అప్పటి పీపుల్స్‌వార్‌ నక్సల్స్‌తో పరిచయం ఏర్పడింది. కాలేజీకి వెళ్లిన రవి అటు నుంచి అటే అడవిబాట పట్టాడు. అప్పటి నుంచి ఇంటికి తిరిగి చూడలేదు. దండకారణ్యంలో సుదీర్ఘకాలం పాటు పనిచేసిన రవి.. ప్రస్తుతం డివిజనల్‌ కమిటీ సభ్యుడి హోదాలో పనిచేస్తున్నాడు. కాగా రవి పోలీసుల అదుపులో ఉన్నాడంటూ మూడు రోజుల క్రితం ‘సాక్షి’లో కథనం ప్ర చురితమైంది. దీంతో రవి లొంగిపోయి ఇంటికి వస్తే బాగుండు అని అతడి కుటుంబ స భ్యులు ఆశించారు. అతడి రాక కోసం తండ్రి రామయ్య వేయి కళ్లతో ఎదురుచూస్తున్నా డు. శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపో యినట్లు డీజీపీ ప్రకటించడంతో రవి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

నగరంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో నేలపై పడుకున్న విద్యార్థులు

ఖలీల్‌వాడి: పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాల్లో సమస్యలు తిష్టవేశాయి. పూర్తిస్థాయిలో వసతులు లేక విద్యార్థులు తిప్పలు పడుతున్నారు. జిల్లాలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసౌకర్యాల నడుమ వసతి గృహాలు కొట్టుమిట్టాడుతున్నాయి. జిల్లాలో 32 సాంఘిక సంక్షేమ వసతి గృహల్లో 2,160 మంది, 10 ఎస్టీ వసతి గృహాల్లో 1,400 మంది, 33 బీసీ సంక్షేమ హాస్టళ్లలో 3,327 మంది విద్యార్థులు చదువుతున్నారు.

నేలపైనే నిద్ర..

జిల్లాలో పలు వసతిగృహాలు అద్దె భవనాలు, మరికొన్ని సొంత భవనాల్లో కొనసాగుతున్నాయి. అయితే, వసతిగృహల్లో విద్యార్థులు ఉండే గదులకు కిటికీలు, తలుపులు విరిగిపోయి ఉన్నాయి. దీంతో పిల్లలు చలికి వణుకుతున్నారు. ప్రభుత్వం దుప్పట్లు సరఫరా చేయకపోవడంతో ఇబ్బందిపడుతున్నారు. హీటర్లు, గీజర్లు లేక చన్నీళ్లతో స్నానాలు చేస్తున్నారు. కొన్ని హాస్టళ్లలో గీజర్లు ఉండగా, మరికొన్ని చోట్ల అవి మూలనపడ్డాయి. చన్నీళ్ల స్నానం చేయడంతో విద్యార్థులు జ్వరం, దగ్గు, జలుబు బారిన పడుతున్నారు. బీసీ సంక్షేమ వసతి గృహాల్లో స్వచ్ఛంద సంస్థలు దుప్పట్లను సమాకూర్చాయి. కొన్ని వసతి గృహాల్లో దుప్పట్లు లేకపోవడంతో విద్యార్థులు పాత దుప్పట్లతో సర్దుకోవాల్సి వస్తోంది. మరోవైపు పలు వసతి గృహాల్లో విద్యార్థులు నిద్రించేందుకు బెడ్లను అందించినా వాటిపై పరుపులు లేవు. దీంతో రాత్రివేళ్లలో నేలపై నిద్రిస్తున్నారు.

నగరంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో చలిగాలి వీచకుండా కిటికీకి పెట్టిన పరదా

వేడి నీటిని అందించాలి

చలికాలం దృష్ట్యా విద్యా ర్థులకు వేడి నీటిని అందించాలి. విద్యార్థులు వాటర్‌ ట్యాంక్‌, బోరుబావుల నీ టిని వాడకోవడంతో వ్యా ధుల బారిన పడే ప్రమా దం ఉంది. ప్రభుత్వం వెంటనే దుప్పట్లను పంపిణీ చేయాలి. – విఘ్నేశ్‌, ఎస్‌ఎఫ్‌ఐ,

జిల్లా కార్యదర్శి, నిజామాబాద్‌

ఇబ్బందుల్లేకుండా చూస్తున్నాం

సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు ప్రభుత్వం నుంచి వచ్చిన దుప్పట్లు, మంకీ క్యాప్‌లను అందజేశాం. వసతిగృహాల్లో గ్లీజర్లు లేవు. వేల్పూర్‌లోని వసతిగృహంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కిటికీలు, తలుపులను బాగుచేశాం. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.

– రాజగంగారాం, సాంఘిక సంక్షేమశాఖ అధికారి, నిజామాబాద్‌

మరమ్మతులు చేపట్టాలి

వసతిగృహాల గదుల్లోని కి టికీలు, తలుపులను బాగు చేయాలి. దీంతో విద్యార్థుల గదిలో చలి తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. గీజర్లను అందుబాటులోకి తేవాలి. విద్యార్థులకు కావాల్సిన బెడ్లు, పరుపులు, దుప్పట్లను సరఫరా చేయాలి.

– రఘురాం, ఏఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, నిజామాబాద్‌

వసతి గృహాలపై చలిపంజా

అందని దుప్పట్లు, విరిగిన కిటికీలు,

తలుపులతో ఇబ్బందులు

మూలన పడ్డ హీటర్లు, గీజర్లు..

చన్నీళ్లతోనే స్నానాలు.. జ్వరాలు,

జలుబు సోకి అవస్థలు

చలి తీవ్రతకు వసతి గృహాల్లోని విద్యార్థులు గజగజ వణుకుతున్నారు. కిటికీలకు తలుపులు లేక చలిగాలులకు అల్లాడుతున్నారు. చన్నీటి స్నానాలతో ఇబ్బంది పడుతున్నారు. పలు వసతి గృహాల్లో ఇప్పటివరకు దుప్పట్లు అందకపోవడంతో చలితో సావాసం చేస్తున్నారు.

వణుకుతున్న విద్యార్థి1
1/7

వణుకుతున్న విద్యార్థి

వణుకుతున్న విద్యార్థి2
2/7

వణుకుతున్న విద్యార్థి

వణుకుతున్న విద్యార్థి3
3/7

వణుకుతున్న విద్యార్థి

వణుకుతున్న విద్యార్థి4
4/7

వణుకుతున్న విద్యార్థి

వణుకుతున్న విద్యార్థి5
5/7

వణుకుతున్న విద్యార్థి

వణుకుతున్న విద్యార్థి6
6/7

వణుకుతున్న విద్యార్థి

వణుకుతున్న విద్యార్థి7
7/7

వణుకుతున్న విద్యార్థి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement