మాక్‌డ్రిల్‌ను పకడ్బందీగా నిర్వహించాలి
నిజామాబాద్‌అర్బన్: ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవడంపై ఈనెల 22న జిల్లాలో నిర్వహించనున్న మాక్‌డ్రిల్‌ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
వరదలు, పారిశ్రామిక ప్రమాదాలు, విపత్తులు సంభవించిన సమయాలలో ప్రాణ, ఆస్తి నష్టం నివారించేందుకు చేపట్టాల్సిన తక్షణ చర్యలపై సన్నద్ధతను పెంపొందించేందుకు వీలుగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ) సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం మాక్ ఎక్సర్ సైజ్ నిర్వహించాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎన్‌డీఎంఏ మేజ ర్ సుధీర్, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ హసనైన్, తెలంగాణ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ నారాయణరావు, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మాక్ ఎక్సర్ సైజ్ నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ విపత్తులు సంభవించిన సమయంలో సమ ర్థవంతంగా ఎదుర్కొనేలా సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇటీవల ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో ఎగువన మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టుతోపాటు నిజాంసాగర్ రిజార్వాయర్ ద్వారా జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం వచ్చి చేరిందని గుర్తుచేశారు. ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల స్థితిగతులను ముందస్తుగానే తెలుసుకుంటూ తదనుగుణంగా ఎస్సారెస్పీ ద్వారా దిగువకు మిగులు జలాలు విడుదల చేశామని తెలిపారు. శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్ ప్రాంతాలైన ఆరు గ్రామాలు ముంపు ప్రభావానికి గురయ్యాయని, తక్షణ సహాయక చర్యలు చేపట్టి ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించగలిగామని కలెక్టర్ పేర్కొన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి జిల్లా అధికారులతో సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఈ నెల 22న నిర్వహించే మాక్ ఎక్సర్‌సై జ్ ప్రయోగాత్మక కార్యక్రమం అయినప్పటికీ ప క్కాగా నిర్వహించాలని ఆదేశించారు. విపత్తుల సమయంలో నీటిపారుదల, అగ్నిమాపక, విద్యుత్, రహదారుల, పోలీస్, రెవెన్యూ, వైద్య, పౌరసరఫరాల తదితర శాఖల అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, అగ్నిమాపక శాఖ అధికారి పరమేశ్వర్, జెడ్పీ సీఈవో సాయా గౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, పరిశ్రమల శాఖ రీజినల్ డిప్యూటి చీఫ్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మి, కలెక్టరేట్ విపత్తుల నిర్వహణ విభాగం పర్యవేక్షకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


