తెలుగు విభాగంలో ఇద్దరికి డాక్టరేట్
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖలో పరిశోధక విద్యార్థులు నాయకోటి సుజాత, కటుకొజ్జ్వల ఎల్బీ శాస్త్రి డాక్టరేట్ సాధించారు. ఆర్ట్స్ డీన్, తెలుగు విభాగం ప్రొఫెసర్ కే లావణ్య పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి నాయకోటి సుజాత ‘తెలంగాణలో దేవులపల్లి రామానుజారావు గారి స్థానం’, ప్రొఫెసర్ త్రివేణి పర్యవేక్షణలో కటుకొజ్జ్వల ఎల్బీ శాస్త్రి ‘సిద్దిపేట జిల్లా సాహిత్య చైతన్యం–సమగ్ర పరిశీలన’ అనే అంశంపై పరిశోధన పూర్తిచేసి సిద్ధాంత గ్రంథాలు సమర్పించారు. బుధవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాన్ఫరెన్స్ సెమినార్ హాల్‌లో నిర్వహించిన బహిరంగ మౌఖిక పరీక్షకు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతి ప్రొఫెసర్ సాగి కమలాకర శర్మ ఎక్స్ టర్నల్ ఎగ్జామినర్‌గా వ్యవహరించారు. అనంతరం సుజాత, ఎల్బీ శాసీ్త్రలను అధ్యాపకులు అభినందించారు. కార్యక్రమంలో ఆర్ట్స్ డీన్ కరిమిండ్ల లావణ్య, ప్రొఫెసర్ కనకయ్య, తెలుగు అధ్యయనశాఖ విభాగాధిపతి, బీవోఎస్ చైర్మన్ సీహెచ్ లక్ష్మణ చక్రవర్తి, కంట్రోలర్ కే సంపత్ కు మార్, ప్రొఫెసర్ సీహెచ్ ఆరతి, ప్రొఫెసర్ కే రవీందర్ రెడ్డి, ప్రొఫెసర్ కే అపర్ణ, అబ్దుల్ ఖవి, గుల్ ఏ రానా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


