కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
సుభాష్‌నగర్/నిజామాబాద్ రూరల్ : నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో బీజేపీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో గురువారం నగరంలోని బీజేపీ కా ర్యా లయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముట్టడి సమాచారం ముందుగానే తెలుసుకు న్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులా చారి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో బీజేపీ శ్రేణులు పెద్దసంఖ్యలో కార్యాలయానికి చేరుకున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు బీజేపీ కార్యాలయం వద్ద భారీగా మో హరించారు. కాంగ్రెస్ నాయకులు రాకుండా.. బీజేపీ నాయకులు వెళ్లకుండా.. బారీకేడ్లు ఏర్పాటుచేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయం వద్దనున్న వేణుమాల్‌కు చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. ఈ నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, యువజన అధ్యక్షుడు విపుల్ గౌడ్ తదితర నాయకులను పోలీసులు ఎల్లమ్మగుట్ట చౌరస్తా, పోచమ్మగల్లీ ప్రాంతాల్లో అరెస్టు చేసి ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు బీజేపీ నాయకులు బారీకేడ్లను దాటుకుంటూ కాంగ్రెస్ నాయకుల వద్దకు చొ చ్చుకొచ్చారు. ఈ క్రమంలో పోలీసులు, నాయకుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అప్రమత్తమై బీజేపీ నాయకులను సముదా యించిన తిరిగి వారి పార్టీ కార్యాలయానికి పంపించారు. మోదీ, రాహుల్‌గాంధీ, కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా పరస్పరం నినాదాలు చేసుకున్నారు. బీజేపీ నాయకులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, స్వామి యాదవ్, న్యాలం రాజు, కోడూరు నాగరాజు, ఆమంద్ విజయ్ కృష్ణ, చిరంజీవి, శంకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
70 మందిపై కేసు నమోదు
నిజామాబాద్ అర్బన్: బీజేపీ కార్యాలయం ముట్టడి ఘటనలో 70 మంది కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదైంది. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్ రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణతోపాటు మిగతా నాయకులపై ఒకటో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
బీజేపీ కార్యాలయ ముట్టడికి
కాంగ్రెస్ నాయకుల యత్నం
నగరంలో ఉద్రిక్తత
పోలీసులు, నాయకుల మధ్య తోపులాట
కాంగ్రెస్ నాయకులను
అదుపులోకి తీసుకున్న పోలీసులు
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ


