సమన్వయం అంతంతే
న్యూస్‌రీల్
నిజామాబాద్
భత్యంపై ఉద్యోగుల..
ఉద్యోగులకు ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం కాకుండా తక్కువ భత్యం చెల్లించడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది.
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
– 8లో u
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో అధికార కాంగ్రెస్ ఆధిపత్యం సాధించినప్పటికీ కీలక నాయకుల మధ్య మాత్రం సమన్వయ లేమి కొట్టొచ్చినట్లు కనిపించింది. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సొంత నియోజకవర్గమైన బాల్కొండలో నాయకులతో సమన్వయం చేసుకోవడంలో నియోజకవర్గ ఇన్‌చార్జి సునీల్‌రెడ్డి విఫలమవ్వడంతో కీలకమైన కమ్మర్‌పల్లి, వేల్పూర్, ఏర్గట్ల, బాల్కొండ, మోర్తాడ్ తదితర మేజర్ గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఓడిపోయారని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. ఆ జీపీలను ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలుచుకున్నారు. ఇదిలా ఉండగా బాల్కొండ నియోజకవర్గం నుంచి ముగ్గురు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. అయితే సునీల్‌రెడ్డి తమను పట్టించుకోలేదని పార్టీ అభ్యర్థులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్‌లను అడిగితే మాత్రం తాము పట్టించుకున్నప్పటికీ అభివృద్ధి నిధుల విడుదలకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇచ్చే స్థితిలో తాము లేమని చెప్పినట్లు కార్యకర్తలు చెబుతున్నారు. దీంతో నాయకులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఫలితం లేదని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ సొంత గ్రామమైన కిసాన్‌నగర్, నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌రెడ్డి ఉండే మోర్తాడ్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి ఓటు ఉన్న నర్సాపురంలో బీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట అన్వేష్‌రెడ్డి సొంత గ్రామం పచ్చల నడ్కుడలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. దీంతో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఆధిక్యం వచ్చినప్పటికీ ఆ పార్టీ కార్యకర్తలకు, కీలక నాయకులకు మాత్రం నిరాశను మిగిల్చింది.
● నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్ సొంత గ్రామం సిరికొండ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ మద్దతుదారుడు గెలు పొందాడు. గడ్కోల్ పంచాయతీలో కాంగ్రెస్ నాయకుడు భాస్కర్‌రెడ్డి మాత్రం తాను నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించుకున్నారు. ఇక్కడ ఉత్కంఠ పో రు నడిచింది. ఇక్కడ భాస్కర్‌రెడ్డి నిలబెట్టిన అభ్యర్థికి పోటీగా బీజేపీ, బీఆర్‌ఎస్, వామపక్షాలకు చెందిన రాష్ట్ర, జిల్లా నాయకులు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టారు. అయినప్పటికీ భాస్కర్‌రెడ్డి నిలబెట్టిన కాంగ్రెస్ అభ్యర్థే గెలుపొందారు. జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి మేజర్ పంచాయతీని సీనియర్ నా యకుడు మునిపల్లి సాయిరెడ్డి ఏకగ్రీవం చేయించు కుని తన పట్టును నిలబెట్టుకున్నారు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి సొంత గ్రామం ముదక్‌పల్లిలో ఆయన నిలబెట్టిన అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థి గెలిచాడు. పీసీసీ డెలిగేట్ బా డ్సి శేఖర్‌గౌడ్ సొంత గ్రామం బాడ్సిలో బీఆర్‌ఎస్ గెలిచింది. మోపాల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిరెడ్డి సొంత గ్రామమైన మోపాల్‌లో బీజేపీ గె లిచింది. కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు, మా జీ ఎంపీపీ యాదగిరి సొంత గ్రామం ఎల్లమ్మకుంటలో బీజేపీ గెలిచింది. డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి సొంత గ్రామం ముల్లంగిలో తన అభ్యర్థిని గెలిపించుకున్నారు. అంకాపూర్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత మార చంద్రమోహన్‌రెడ్డి తాను నిలబెట్టిన అభ్యర్థిని 1,545 ఓట్ల ఆధిక్యంతో గెలిపించుకున్నారు.
బీజేపీ విషయానికి వస్తే కీలక నాయకులు అంతగా పట్టించుకోలేదని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేశ్ సొంత గ్రామం అమృతాపూర్‌లో బీఆర్‌ఎస్ గెలిచింది. ఇక ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి సొంత గ్రామం అంకాపూర్‌కు మాత్రమే పరిమితమయ్యారు. ఇక్కడ రాకేశ్‌రెడ్డి నిలబెట్టిన అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి 1,545 ఓట్ల తేడాతో గెలిచారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మద్దతు ఉన్నప్పటికీ బీజేపీ ఓడిపోయింది.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పనితీరుపై పార్టీ కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. జీవన్‌రెడ్డి సొంత నియోజకవర్గం ఆర్మూర్‌లో బీఆర్‌ఎస్ అట్టర్ ఫ్లాప్ అయింది. బోధన్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ అడ్రస్ లేకపోవడంతో బీఆర్‌ఎస్ పూర్తిగా చతికిలపడింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోనూ బాజిరెడ్డి గోవర్ధన్ నిలబెట్టిన అభ్యర్థులు అత్యధిక సంఖ్యలో ఓటమి చెందారు. బాజిరెడ్డి గోవర్ధన్ సొంత గ్రామం చీమన్‌పల్లిలో స్వతంత్ర అభ్యర్థి గెలిచాడు. బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మాత్రమే మంచి విజయాలు సాధించేలా సక్సెస్ అయ్యారు.
జీపీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆధిపత్యం సాధించినా.. మేజర్ గ్రామాల్లో ఓటమి
పీసీసీ అధ్యక్షుడి సొంత నియోజకవర్గంలో
ఇన్‌చార్జీ పనితీరుపై అసంతృప్తి!
రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల సొంత
పంచాయతీల్లో మద్దతుదారులను వరించని విజయం
మరోవైపు కీలక మండల కేంద్రాల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ మద్దతుదారుల గెలుపు
బీఆర్‌ఎస్‌లో తగ్గిన నాయకుల
పోరాట పటిమ
వేముల ప్రశాంత్‌రెడ్డి మినహా
మిగిలిన నేతల వైఫల్యం
బాన్సువాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పో చారం శ్రీనివాసరెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి వ ర్గాల మధ్య పోరు నేపథ్యంలో కీలకమైన మోస్రా, పొతంగల్ మండల కేంద్రాల్లో బీజేపీ గెలిచింది. చందూర్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ గెలిచింది.
సమన్వయం అంతంతే


