క్రైం కార్నర్
లారీ ఢీకొని ఒకరి మృతి
ఇందల్వాయి: కాలినడకన రోడ్డు గుండా ఇంటికి వెళ్తున్న ఓ వ్యక్తిని లారీ వెనుక నుంచి ఢీకొనడంతో మృతి చెందిన ఘటన ఇందల్వాయి టోల్‌ప్లాజా ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇందల్వాయి ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మేఘ్యనాయక్ తండాకు చెందిన లకావత్ లింబ్య(70) అనే వృద్ధుడు గురువారం ఉదయం చికిత్స కోసం ఇందల్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు. మందులు తీసుకొని స్వగ్రామానికి కాలినడకన రోడ్డు గుండా వెళ్తుండగా టోల్‌ప్లాజా ప్రాంతంలో హైదరాబాద్ నుంచి వస్తున్న లారీ వెనుక నుంచి అతన్ని ఢీకొన్నది. దీంతో ఘటన స్థలిలోనే లింబ్య మృతి చెందాడు. లారీ డ్రైవర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి కుమారుడు మోజీరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
చికిత్స పొందుతూ ఒకరు..
దోమకొండ: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓ వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందాడు. దోమకొండ మండల కేంద్రానికి చెందిన సన్నిది యాదగిరి(52) అనే వ్యక్తి ఈ నెల 15న పనినిమిత్తం సిరిసిల్లా జిల్లా కేంద్రానికి మరో యువకుడితో కలిసి బైక్‌పై వెళ్లారు. తిమ్మాపూర్ వద్ద బైక్ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనలో యాదగిరి తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం సిరిసిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
రుద్రూర్: మండల కేంద్రంలోని జవహార్‌నగర్ కాలనీ వద్ద రెండు కార్లు గురువారం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఐతే ప్రమాదంలో కార్లు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కార్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపడుతున్నారు.
క్రైం కార్నర్
క్రైం కార్నర్


