అందరి సహకారంతో ప్రశాంతంగా ఎన్నికలు
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
సుభాష్‌నగర్ : జిల్లాలోని అందరి సహకారంతో పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మూడు విడతల్లో జరిగిన ఎన్నికలు సాఫీగా ముగిసిన నేపఽథ్యంలో గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్, అదనపు కలెక్టర్లు, ఇతర నోడల్ అధికారులను జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే తరహాలో సమష్టిగా కృషి చేయా లని సూచించారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నిజా మాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, డీఎల్‌పీవోలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
చెత్త సేకరణ ప్రక్రియను పర్యవేక్షించాలి
అందరికీ కృతజ్ఞతలు
సీపీ సాయిచైతన్య
నిజామాబాద్ అర్బన్ : ప్రజల సహకారంతోనే గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని సీపీ సాయిచైతన్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఈ నెల 17 వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కృషి చేసిన అన్ని రాజకీయ పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. శాంతిభద్రతల కోసం కిందిస్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ప్రజలు, పోలీస్ అధికారుల సమన్వయంతో ఎన్నికలు సజావుగా నిర్వహించినట్లు వివరించారు.


