సమాచార హక్కుతో పాలనలో పారదర్శకత
సుభాష్‌నగర్: ఆర్టీఐతో పాలనలో పారదర్శకత పెరుగుతుందని, ఇది ఒక బ్రహ్మాస్త్రం లాంటిదని సమాచార హక్కు చట్టం ప్రచార ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కోయడి నర్సింహులు గౌడ్ అన్నారు. గురువారం నగరంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ఆర్టీఐ ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం ప్రచార ఐక్యవేదిక జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. సమాచార హక్కు చట్టం ప్రచార ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడిగా కోయేడి నర్సింహులు గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శ్రీరాంరాజ్, ఉపాధ్యక్షులుగా వై గోవర్ధన చారి, సోయల్ ఖాన్, డీఎల్‌ఎన్ చారి, కట్ట నరేశ్, ప్రధాన కార్యదర్శిగా మిర్జా అఫ్సర్ బేగ్, జాయింట్ సెక్రెటరీగా మౌలాకాన్, సుశీల్ కుమార్, తళవేద నరేశ్, గంగాధర్, చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులుగా శ్రీరామ్‌గౌడ్, సయ్యద్ అక్బర్, అనిల్ కుమార్, జాఫర్ అహ్మద్ ఎన్నికయ్యారు.


