పెద్దపులి జాడ కోసం గాలింపు
మాచారెడ్డి: పాల్వంచ మండలం ఇసాయిపేట గ్రామశివారులో బుధవారం దూడపై పెద్దపులి దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అటవీ శాఖ రెస్క్యూ టీం ట్రాకర్స్ ట్రాప్ కెమెరాలను గురువారం అమర్చి గాలింపు ముమ్మరం చేశారు. ఇసాయిపేట శివారులో పెద్దపులి సంచరిస్తున్నట్టు ఇటీవల అమర్చిన ట్రాప్ కెమెరాలో రికార్డయినట్టు డిప్యూటీ రేంజ్ అధికారి రమేశ్ తెలిపారు. స్థానికులు భయాందోళనకు గురికావొద్దని, రాత్రివేళలో ఒంటరిగా పంట చేల వద్దకు వెళ్లొద్దని సూచించారు. పశువులు, గొర్రెల కాపర్లు అటవీ ప్రాంతానికి వెళ్లొద్దని తెలిపారు.


